Atukula vada receipe in Telugu
Atukula vada receipe in Telugu

అటుకుల వడలు తయారీ

కావల్సినవి:

అటుకులు – నాలుగుకప్పులు, పెరుగు – రెండు కప్పులు, బొంబాయిరవ్వ – అరకప్పు, పచ్చిమిర్చి – ఆరు, అల్లం తరుగు – రెండు చెంచాలు, జీలకర్ర – చెంచా, నూనె – వేయించేందుకు సరిపడా, ఉప్పు – తగినంత, ఉల్లిపాయముక్కలు – అరకప్పు, కరివేపాకు రెబ్బలు – రెండు, పసుపు – అరచెంచా, కొత్తిమీర తరుగు – రెండు పెద్ద చెంచాలు.

తయారీ:

ఓ గిన్నెలో పెరుగు తీసుకోవాలి. అందులో పసుపూ, బొంబాయిరవ్వ, పచ్చిమిర్చి ముక్కలూ, అల్లం తరుగూ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అటుకుల్ని నీళ్లలో నానబెట్టుకోవాలి. ఐదు నిమిషాలయ్యాక నీళ్లు పిండేసి గట్టిగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెరుగులో వేయాలి. తరవాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. బాణలిలో నూనె వేడిచేసి ఈ మిశ్రమాన్ని వడల్లా తట్టుకుని అందులో వేయాలి. ఎర్రగా వేగాక తీసేస్తే సరిపోతుంది.