ఇప్పుడు ‘మహానటి’గా నిత్యా మీనన్!

టాలీవుడ్ లో బయోపిక్ ల హవా బాగానే నడుస్తోంది. ఈమధ్యనే వచ్చిన ‘మహానటి’ సినిమాలో సావిత్రి గారిలా కీర్తి సురేష్ కనిపించింది. పాత్ర పోషించింది అనటం కంటే పాత్రలో జీవించింది అంటే బావుంటుందేమో. అచ్చు సావిత్రి గారి లాగానే కనిపిస్తూ, నిజంగా సావిత్రి మళ్ళీ తిరిగిస్తే ఎలా ఉంటుంది అలా నటించి మన మనసుల్ని దోచుకుంది. ఇకపోతే ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నది ఎన్టీఆర్ బయోపిక్ మీద. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదలవనుంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా సావిత్రి గారి పాత్ర ఉంటుంది.

మరి ఈ సినిమాలో సావిత్రి గారిలా ఎవరు నటిస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లా మిగిలింది. అయితే ఇప్పుడా ప్రశ్నకు సమాధానం దొరికేసింది. నిత్యా మీనన్ ‘ఎన్టీఆర్’ సినిమాలో సావిత్రి పాత్రలో కనపడనుంది. త్వరలో షూటింగ్ లో కూడా పాల్గొననుంది. అయితే ఈ సినిమాలో ముఖ్య పాత్రాలన్నింటి లోనూ నటించడానికి స్టార్ యాక్టర్ లనే తీసుకున్నారు.

రానా చంద్రబాబు లాగా, సుమంత్ ఏఎన్నార్ లాగా కనపడనుండగా నిత్యా సావిత్రి లా మారనుంది. అది హీరోయిన్ రోలా కాదా అని ఆలోచించకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఓకే చేయడం నిత్యా స్పెషలిటీ. ఇప్పటిదాకా అలాంటి చాలా పాత్రల్లో మనల్ని మెప్పించింది. చూద్దాం మరి సావిత్రి లాగా మనల్ని ఎంతవరకు మెప్పిస్తుందో.