Home / Breaking / ఏపీకి న్యాయం జరిగేలా చుడండి గవర్నర్ భేటిలో బాబు
ఏపీకి న్యాయం జరిగేలా చుడండి గవర్నర్ భేటిలో బాబు
ఏపీకి న్యాయం జరిగేలా చుడండి గవర్నర్ భేటిలో బాబు

ఏపీకి న్యాయం జరిగేలా చుడండి గవర్నర్ భేటిలో బాబు

ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు… ఢిల్లీలో దాదాపు అరగంటపాటు రాష్ట్రపతితో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలోని పరిస్థితులను రాష్ట్రపతికి వివరించింది చంద్రబాబు టీమ్.. విభజన ముందు.. ఆ తర్వాత పరిస్థితులను రాష్ట్రపతి దగ్గర ఏకరువు పెట్టారు సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం.. ఏపీ ప్రజల న్యాయమైన డిమాండ్లు అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి నిధులు విడుదల చేయకుండా కేంద్రం కాలక్షేపం చేసిందని మండిపడ్డారు.

హైదరాబాద్‌ అభివృద్ధికి 60 ఏళ్ల పాటు కృషి చేశామని, హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీలో నాయకత్వ లక్షణాలు లేవని విమర్శించిన చంద్రబాబు.. దేశాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనా మోదీకి ఏ కోశానా లేదన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని చూసి ఎంతో మంది కలతచెందారని తెలిపారు. అయితే, విభజన తర్వాత ఇటువంటి ఇబ్బందులు ఉంటాయని రాష్ట్రపతి అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. కొత్త రాష్ట్రం కాబట్టి.. కింది స్థాయి నుంచి రాష్ట్ర నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని రామ్‌నాథ్‌ కోవింద్.. చంద్రబాబు టీమ్‌కు చెప్పినట్టు తెలిపారు.