foods for stress relief
foods for stress relief

ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్థాలు ఇవే..!

పరుగుల జీవితంలో ఒత్తిడిని ఎదుర్కోకుండా పనిచేయడం కష్టం. అయితే నిరంతరం ఎంత బిజీగా ఉన్నా…మానసిక ఒత్తిళ్లను అధిగమించకపోతే ప్రశాంతత కరువవ్ఞతుంది. తద్వారా ఎన్నో జబ్బుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒత్తిళ్లను తగ్గించుకోడానికి చక్కటి వ్యాయామం, నిద్ర మాత్రమే కాదు. ప్రత్యేకించి ఆహారం విషయంలోనూ జాగ్రత్తపడాలి. అలాంటి ఆహారం గురించి తెలుసుకుందాం.

-శరీరంలోని విషతుల్యాలను శుభ్రం చేస్తుంది కెరోటిన్‌. ఇది బొప్పాయిలో దొరుకుతుంది. వారంలో కనీసం రెండుమూడు సార్లు అయినా ఉదయాన్నే బొప్పాయిని తినడం శ్రేయస్కరం.

-చిలగడదుంపలో అత్యధిక పీచుతో పాటు కార్బొహైడ్రేట్లు లభిస్తాయి. మానసిక ఒత్తిళ్లను తగ్గించే గుణం దీని సొంతం.

-జీర్ణవ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది అరటిపండు. ఇందులోని మెగ్నీషియం రక్తపోటులో హెచ్చుతగ్గులు లేకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుదలకు తోడ్పడుతుంది.

-చక్కటి నిద్రకు, మెదడు చురుకుదనానికి లాక్టోజ్‌ అవసరం. ఇది పాలలో అధికం. రోజుకు ఒక గ్లాసు పాలు తాగితే ఒత్తిళ్లకు దూరం కావొచ్చు. తద్వార నరాల బలహీనత రాదు.

-ఆల్మండ్స్‌లోని మెగ్నీషియం, జింక్‌, విటమిన్‌బి 2, విటమిన్‌ ఇ,సి లు మానసిక ప్రశాంతతకు ఉపకరిస్తాయి. ఇందులో కొవ్వు అధికం. అయినా హానికరం కాదు.

apteka mujchine for man ukonkemerovo woditely driver.