Home / Breaking / ఆయన నన్ను.. ఓ తమ్ముడిలా.. ఓ కొడుకులా చూసుకొన్నారు.
ఓ తమ్ముడిలా.. ఓ కొడుకులా చూసుకొన్నారు మెగాస్టార్ చిరంజీవి
ఓ తమ్ముడిలా.. ఓ కొడుకులా చూసుకొన్నారు మెగాస్టార్ చిరంజీవి

ఆయన నన్ను.. ఓ తమ్ముడిలా.. ఓ కొడుకులా చూసుకొన్నారు.

మహారాజు, మగమహారాజు, మగధీరుడు, గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు విజయ బాపినీడు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం మృతిచెందారు. తనకు అద్భుతమైన విజయాలను అందించిన విజయబాపినీడు మృతి వార్తతో మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

చిరంజీవి మాటల్లో… ఈ రోజు నాకు దుర్దినం
విజయ బాపినీడు మరణం నాకెంతో దుర్దినం. విజయ బాపినీడు గారు మరణించారనేది నమ్మలేకుండా ఉంది. ఆయన నన్ను ఓ కొడుకులా, ఓ తమ్ముడిలా చూసుకునే వారు. ఆయనతో నా అనుబంధం కేవలం ఓ దర్శకుడు, నిర్మాతలా ఉండేది కాదు. నా మనసుకు అతి దగ్గరైన వ్యక్తి బాపినీడు గారు. వారితో నా పరిచయం ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమా నుండీ. అప్పట్నించి ఆరు సినిమాలకు పైగా ఆయన నాతో చేయడం జరిగింది. అని చెబుతూ చాలా కాలం నా పట్ల ఆ అభిమానాన్ని, ప్రేమను చూపించిన గొప్ప వ్యక్తి.

కొడుకులా వాత్సల్యం చూపించేవారు.
తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు తరలివచ్చిన సమయంలో నేను హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన కొత్తలో ఎక్కడ ఉండాలి అని అనుకుంటున్న సమయంలో ‘హైదరాబాద్ లో నా గెస్ట్ హౌస్ ఉంది. మీరు అందులో ఉండొచ్చు’ అని చెప్పి…. పై ఫ్లోర్ లో ఉండే వారిని కింద కు పంపించి, పై రెండు ఫోర్లు నాకు ఇచ్చారు. చాలా కాలం అక్కడే ఉన్నాను. నా మీద ప్రేమను అలా చూపిన గొప్ప మనసున్న మనిషి ఆయన. అలాంటి విజయబాపినీడు లాంటి వ్యక్తిని ఇవాళ కోల్పోవడం అనేది చాలా బాధకరంగా ఉంది. చాలా దురదృష్టంగా భావిస్తున్నాను. బాపినీడు గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, నా సానుభూతిని తెలియచేస్తున్నాను.