Mana Aksharam
  • Home
  • Health
  • కరివేపాకు ఉపయోగాలు తెలుసా ?
Health News

కరివేపాకు ఉపయోగాలు తెలుసా ?

కరివేపాకు ఉపయోగాలు తెలుసా ?

కరివేపాకును ఈజీగా తీసిపారేయకండి. కరివేపాకుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కరివేపాకు రోజూ తింటే చాలా హెల్తీగా ఉండొచ్చు. సాధారణంగా వంటకాలకు కాస్త మంచి వాసన రావాలని మనం కరివేపాకు ఉపయోగిస్తుంటాం. కొందరు తినేటప్పుడు కరివేపాకు పక్కకు పడేస్తుంటారు. అలా చేయకండి.  అలాగే పచ్చి కరివేపాకు ఆకులను తిన్నా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

కొందరు తినేటప్పుడు కరివేపాకు పక్కకు పడేస్తుంటారు. అలా చేయకండి. కరివేపాకులో చాలా ఔషధ గుణాలున్నాయి. అలాగే పచ్చి కరివేపాకు ఆకులను తిన్నా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి

కొందరు షుగర్ తో ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారు రోజూ కరివేపాకు తింటే మంచిది. బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ను తగ్గించే శక్తి కరివేపాకుకు ఉంటుంది. 

ఎక్కువ ఫ్యాట్ తో ఇబ్బందిపడేవారు రోజూ కరివేపాకు తింటూ ఉండండి. రోజూ కొన్ని పచ్చి కరివేపాకు ఆకులను తిన్నా కూడా చాలా మంచిది. బాడీలొని చెడ్డ కొలస్ట్రాల్ ను కూడా కరివేపాకు ఈజీగా తగ్గించగలదు.

బాడీకి విటమిన్ ఏ చాలా అవసరం. కరివేపాకులో ఇది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోజూ మీరు దీన్ని తీసుకుంటూ ఉండండి. విటమిన్ ఏ ఎక్కువగా బాడీకి అందితే కంటిచూపు బాగా ఉంటుంది

చాలా మంది వెంట్రుకలు రాలే సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారు రోజూ కరివేపాకు తీసుకుంటే డాండ్రఫ్ తో పాటు జుట్టు రాలిపోవడంలాంటి సమస్యలను అధిగమించొచ్చు. అలాగే జుట్టు త్వరగా తెల్లగా అవ్వదు. జుట్టు బాగా పెరుగుతుంది. నిగనిలలాడుతుంది.

కరివేపాకును రోజూ తింటే మీకు ఎలాంటి మూత్ర సమస్యలు కూడా ఉండవు. మూత్రంలో మంట, మూత్రం సరిగ్గా రాకపోవడంలాంటి సమస్యలు ఏమీ కూడా ఉండవు. కిడ్నీల్లో కొందరికి రాళ్లు ఏర్పడుతుంటాయి. అలాంటి వాటిని కరివేపాకు ఈజీగా కరిగించగలదు.
కరివేపాకులో చాలా రకాలైన విటమిన్స్ ఉంటాయి. ఇందులో కెరోటిన్ బాగా ఉంటుంది. ఎన్నో పౌష్టిక విలువలు కరివేపాకులో ఉంటాయి.

కరివేపాకు ఆకలిని బాగా పెంచగలదు. అజీర్తి సమస్య ఉంటే కూడా ఈజీగా తగ్గిపోతుంది. ఆకలిగా లేని వారు కరివేపాకును రోజూ తింటూ ఉండాలి.

వాంతులు కాకుండా చేసే గుణం కరివేపాకు ఉంటుంది. కడుపులో కాస్త తిప్పుతున్నట్లు అనిపిస్తే కరివేపాకు రసంలో కాస్త నిమ్మకాయ రసం, చక్కెర కలుపుకుని తాగండి.

విరేచనాలతో బాధపడేవారు కరివేపాకును బాగా ఎండబెట్టి దాన్ని పొడిగా చేసుకుని కాస్త తేనె కలుపుకుని తాగండి. ఇలా చేస్తే విరేచనాలు ఈజీగా తగ్గిపోతాయి. రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకులను తిని చూడండి. మీకున్న అనారోగ్యాలన్నీ మటుమాయం అవుతాయి. అసలు అనారోగ్యాల బారిన కూడా పడరు

Related posts

కాషాయ దళాన్ని పక్కన పెట్టిన టీడిపి!

admin

బాబుది ‘దొంగ’ దీక్ష!

Masteradmin

ఆ ముగ్గురు ఆంధ్రా ద్రోహులు!

admin