tips for beautiful eyes
tips for beautiful eyes

కళ్లు అందంగా ఉండాలంటే.!

దేహ సౌందర్యంలో కళ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. చూడగానే ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకునేవి కళ్లు. ఇవి ఆరోగ్యంగా ఉంటే మన అందం పదింతలైనట్ల్లే. కనుక కళ్లను ఎప్పుడూ ఆరోగ్యంగా కాపాడుకోవాలి.

తీపి పిండి పదార్థాలను ఎక్కువగా తినవద్దు. దీనివల్ల కళ్లు నిస్సారంగా కనిపిస్తాయి.

రక్తనాళాలు ఇబ్బందికి గురైతే కళ్లు అలసిపోయినట్లుగా కనిపిస్తాయి. కళ్ల చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితమైనది. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కుంటే రక్తప్రసరణ మంచిగా జరుగుతుంది. యాపిల్ జ్యూస్‌ను కళ్ల చుట్టూ రాసుకోండి. యాపిల్‌జ్యూస్‌లో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. దాంతో కళ్లు మెరుస్తూ కనిపిస్తాయి.

ఎక్కువగా ఒత్తిడికి లోనుకావద్దు. కంప్యూటర్ల ముందు గంటల తరబడి పనిచేయాల్సి వస్తే మధ్యమధ్యలో కళ్లు ఆర్పుతూ వాటికి కొంత విశ్రాంతి కల్పించండి.