Home / News / Headlines / చంద్ర‌బాబు కి ఊహించ‌ని షాక్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!
చంద్ర‌బాబు కి ఊహించ‌ని షాక్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్
చంద్ర‌బాబు కి ఊహించ‌ని షాక్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

చంద్ర‌బాబు కి ఊహించ‌ని షాక్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

చంద్ర‌బాబు కి ఊహించ‌ని షాక్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!
రాజ‌మండ్రి మాజీ మంత్రి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ జ‌న‌వ‌రి 29న‌ అఖిల‌ప‌క్ష స‌మావేశానికి పిలుపునివ్వ‌గా, ప‌లుపార్టీలు పాల్గొన్న విష‌యం తెలిసిందే. అయితే కేంద్ర సాయం, రాష్ట్రానికి జరిగిన అన్యాయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఏకాభిప్రాయం లేకుండానే ముగిసింది. ఈ సమావేశానికి వైసీపీ, సీపీఎం మినహా మిగతా పార్టీలు హాజరయ్యాయి.

రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీలతో చర్చించేది లేదని ఆ రెండు పార్టీలూ సమావేశాన్ని బహిష్కరించాయి. ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు.

అయితే ఇప్పుడు అసలు మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ జ‌న‌వ‌రి 30 బుధ‌వారం ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా అఖిల‌ప‌క్ష స‌మావేశానికి పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో జ‌న‌సేన‌కు కూడా ఆహ్వానం పంప‌గా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఊహించ‌ని షాక్ ఇచ్చారు. చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌ను నిర్వ‌హించ‌బోయే అఖిల‌ప‌క్ష స‌మావేశానికి హాజ‌రు అయ్యేది లేదంటూ ప‌వ‌న్ ఒక బ‌హిరంగ లేఖ‌ను విడుద‌ల చేశారు. ఏదో మొక్కుబ‌డిగా నిర్వ‌హించే స‌మావేశాలకు జ‌న‌సేన పార్టీ దూరంగా ఉంటుంద‌ని, రాజ‌కీయ లబ్ధికోస‌మే చంద్ర‌బాబు, అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నార‌ని, అయినా స‌మావేశానికి ఒక్క‌రోజు ముందు ఆహ్వానాలు అందిస్తారా అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ విరుచుకుప‌డ్డారు. ఇక ఇప్ప‌టికే అఖిలపక్ష సమావేశానికి ఇప్పటికే వైసీపీ, బీజేపీలు హాజరుకాబోమని స్పష్టం చేశాయి. ఇక‌పోతే ప్రస్తుతానికి చంద్రబాబు అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రజా సంఘాలు మాత్రమే మద్దతు ప్రకటించాయి. ఏది ఏమైనా ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబు వేసిన మ‌రో స్టంట్‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుండి ఊహించ‌ని షాక్ ఎదురైంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.