Home / Breaking / చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం..!
చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం
చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం

చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం..!

చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం ప్రారంభమైంది .పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మహిళలపై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో విసిగి పోయిన చిత్తూరు నియోజక వర్గానికి చెందిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నాయకురాలు సుహాసిని రెడ్డి సోమవారం మీడియాను ఆశ్రయించారు. తనకు పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని వెళ్లగక్కే మీడియా ముందు కంటతడి పెట్టారు. జంగాలపల్లి శ్రీనివాసులు రెడ్డి సామాజిక వర్గం పై మహిళలపై వేధింపులు చేస్తున్నారని ఆరోపించారు..

మహిళల సంక్షేమం కోసం ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం చిత్తూరు నియోజకవర్గంలో జరుగుతున్న వివక్షత ధోరణిపై స్పందించాల్సిన అవసరం ఉందని కోరారు. ఏడేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న తనకు ఇలాంటి అవమానాలు జరగడం తట్టుకోలేక పోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.