health benefits of sweet potatoes
health benefits of sweet potatoes

చిలగడదుంపతో ఇన్ని ప్రయోజనాలా ?

చిలగడదుంపలు చాలామందికి ఇష్టం. ఈ తియ్యని దుంపలు ఆరోగ్యంతో పాటు చర్మం సౌందర్యాన్ని కూడా ఇస్తాయి. పవర్‌ ప్యాక్డ్‌ సూపర్‌ఫుడ్‌ అని పిలిచే ఈ చిలగడదుంపల ఉపయోగాలేంటో తెల్సుకుందాం.ఈ ఫైబర్‌ ఫుడ్‌లో విటమిన్‌ ఎ, సి, కాల్షియం, పొటాషియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి.

ఇందులో 35 శాతం నుంచి 90 శాతం విటమిన్‌ ఎ ఉంటుంది. అందుకే చిలగడ దుంపలు తింటే కళ్లకు మంచిది.

ఈ దుంపల్ని తినటం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉండదని ఇటీవలే హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం తేల్చింది.
స్వీట్‌ పొటాటోల వల్ల కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. గుండెకు మంచిది.
చిలగడ దుంపలు తింటే రోజంతా బాగా ఎనర్జీ ఉంటుంది. అందుకే క్రీడాకారుల్ని వీటిని తినమని చెబుతుంటారు.
చిలగడదుంపలు యాంటీ ఏజింగ్‌గా ఉపయోగపడతాయు.లో బీపి ఉండే వారికి ఈ దుంపలు తింటే మంచిది. బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది