women kills her boyfriend and cooks biryani wirh his body
women kills her boyfriend and cooks biryani with his body

తనని కాదన్నందుకు ప్రియుడ్ని చంపి బిర్యానీ చేసుకుందా యువతీ.!

నేరాలు చేయడంలో మహిళలు పురుషులతో పోటీ పడ్తున్నారు. మొరాకో దేశంలో ఓ యువతి ఏడేళ్లుగా ప్రేమించిన అబ్బాయి.. తనను వదిలేసి వేరే అమ్మాయిని వివాహం చేసుకునేందుకు రెడీ కావడంతో తట్టుకోలేకపోయింది.  ఇంటికి చివరిసారిగా పిలిచింది. దీంతో మాజీ ప్రియురాలు ఏదైనా ట్రీట్ ఇస్తుందని ఆశపడి లవర్ వచ్చేశాడు. మాటల్లో దింపి కత్తితో పొడిచి చంపేసింది. ఆ తర్వాత మరణించిన లవర్ దేహాన్ని రాక్షసంగా ముక్కలుగా కోసి మసాలా దట్టించి మరి బిర్యానీ చేసింది. అదే బిర్యానీని తన ఇంటి దగ్గర పనిచేస్తున్న పాకిస్తానీయులకు పంచి పెట్టింది. వారు కొత్తరకం బిర్యానీ అనుకొని తెగ లాగించేశారట..

ఇక చనిపోయిన లవర్ వెళుతూ వెళుతూ మాజీ ప్రియురాలు ఇంటికి వెళుతున్నానని తన తమ్ముడికి చెప్పి వెళ్లాడట.. దీంతో సోదరుడి కోసం యువతి ఇంటికి వెళ్లాడు తమ్ముడు. కానీ బయటకు వెళ్లిపోయాడని మాజీ లవర్ చెప్పడంతో ఇతర చోట్ల కూడా సోదరుడు వెతికాడు. ప్రియురాలిపై అనుమానంతో ఇంట్లోకి వెళ్లి  చూడగా.. ఇంట్లో బిర్యానీలో తన సోదరుడి బంగారు పన్ను కనిపించింది. దీంతో హత్య చేసి బిర్యానీ చేసుకుందని షాక్ అయిన సోదరుడు యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అవయవాలకు డీఎన్ఏ టెస్ట్ చేయగా.. మృతుడి వివరాలు బయటపడ్డాయి. తనను కాదన్నందుకు ప్రియుడినే చంపి బిర్యానీ చేసుకున్న యువతి ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.