rangu movie review and rating
rangu movie review and rating,tanish alladi, tollywod movie

తనీష్ రంగు హిట్/ఫట్?

బాల నటుడిగా.. హీరోగా 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన తనీష్‌కి ఇప్పటి వరకూ సరైన హిట్ పడలేదు. బిగ్ బాస్ సీజన్ 2లో ఫైనల్‌కి చేరడంతో ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటూ.. బెజవాడ రౌడీ షీటర్ లారా వాస్తవ జీవిత కథతో ‘రంగు’ సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తనీష్, ప్రియా సింగ్ హీరో హీరోయిన్లుగా కార్తికేయ.వి దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నల్లస్వామి సమర్పణలో యు అండ్ ఐ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ఎ.పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్న నాయుడులు నిర్మించారు. విడుదలకు ముందు వివాదాలు చుట్టిముట్టిన ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువైందా? బెజవాడ రౌడీ షీటర్ లారా కథతో బిగ్ బాస్ ఫేమ్ తనీష్ మెప్పించగలిగాడా? అన్నది సమీక్షలో తెలుసుకుందాం.
పవన్ కుమార్ అలియాస్ లారా చాల తెలివైఎన్ కుర్రోడు. చదువులో మంచి ర్యాంకులని సాధిస్తూ డిగ్రీలో జాయిన్ అవుతాడు. స్వతహాగ కోప స్వాభివి ఐన లారా గొడవల్లోకి దిగుతాడు. ఆలా గొడవల్లో అనుకోని రీతిలో ఒక వ్యక్తిని చంపి జైలు శిక్ష అనుభవిస్తాడు. జైలులో పరిచయం అయిన ఎమ్ ఎల్ పీ ప్రోద్భలంతో జైలు నుండి బెయిల్‌పై విడుదలై చిన్న చిన్న సెటిల్ మెంట్‌లతో గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు. లారాని తొలిచూపులోనే ప్రేమించిన పూర్ణ అతనితో జీవితం పంచుకోవడానికి సిద్ధ పడుతుంది.పూర్ణ తనపై చూపిస్తున్న ప్రేమను తెలుసుకుని పూర్తిగా మారిపోయి ఆమెను పెళ్లి చేసుకుని ఓ బ్యాంక్‌లో ఉద్యోగంలో చేరతాడు.
సాఫీగా సాగిపోతున్న లారా జీవితాన్ని పాత శత్రువులు వెంటాడుతూ ఉంటారు. అతని ఉద్యోగం లేకుండా చేస్తారు. దీంతో పాత దారులే బ్రతుకుదెరువుగా మార్చుకుంటాడు లారా. ఓ ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో మరో పాత రౌడీ షీటర్ మణికంఠని ఎదిరిస్తాడు. దీంతో లారాని ఎలాగైనా చంపాలని వెంటబతుంటారు. వాళ్ల నుండి తప్పంచుకుంటూ.. ప్రెగ్నెంట్గా ఉన్న తన భార్యని కలుసుకోవడం కోసం పరితపిస్తుంటాడు లారా. మరోవైపు మణికంఠ బారి నుండి లారాను కాపాడేందుకు ఏసీపీ ప్రయత్నిస్తారు. ఇంతకీ లారా బ్రతికి ఉంటాడా? ఏసీపీ అతన్ని కాపాడగలిగారా? అన్నదే మిగతా కథ.
హీరోగా తనీష్ ప్రూవ్ చేసుకోలేకపోయాడు.
హీరోయిన్‌గా నటించిన ప్రియాసింగ్ తన పాత్ర పరిధి మేర బాగానే నటించింది. చివర్లో వచ్చే ఎమోషన్స్ సీన్స్ పండించగలిగింది. ఇక దర్శకుడు కార్తికేయ వి. బెజవాడ రౌడీ షీటర్ వాస్తవ కథను తెరపై చూపించే ప్రయత్నంలో మార్చులు చేర్పులతో కథను కిచిడీ చేసేశారు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ఒకే రకమైన ఫ్లోలో వెళ్లిపోతూ కథను ఆసక్తికరంగా మలచలేకపోయారు. పోసాని, పరుచూరి, షఫి లాంటి సీనియర్‌ నటులు ఉన్నా వాళ్లని పూర్తిగా ఉపయోగించుకోలేపోయారు.
రేటింగ్:2/5