Home / Manavi / పటికబెల్లంతో ఇన్ని ఉపయోగాలా.?
amazing benefits of rock sugar in telugu
amazing benefits of rock sugar in telugu

పటికబెల్లంతో ఇన్ని ఉపయోగాలా.?

ప‌టిక‌బెల్లం.. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. క‌ల‌కండ‌, నౌవోతు, మిస్త్రి, కండ చ‌క్కెర ఇలా అనేక పేర్లు దీనికి ఉన్నాయి. ఇందులో చ‌క్కెర చిన్న చిన్న స్ఫ‌టికాలుగా కాకుండా పెద్ద పెద్ద స్ఫ‌టికాలుగా ఉంటుంది. అయితే కొన్ని చోట్ల చిన్న చిన్న స్ఫటికాల‌తో కూడిన ప‌టిక‌బెల్లం అమ్ముతారు. దానికి బ‌దులుగా పెద్ద స్ఫ‌టికాలు ఉన్న ప‌టిక‌బెల్లాన్ని వాడాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ప‌టిక బెల్లంతో మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

పటికబెల్లం తీపి రుచి కలిగి ఉంటుంది. శరీరానికి చలువ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని, వీర్యపుష్టిని ఇస్తుంది. వాత, పిత్త , కఫ దోషాల వ‌ల్ల క‌లిగే అనేక రోగాల‌కు ఔషధంగా పనిచేస్తుంది. అయితే తియ్యగా ఉందికదా అని ఎక్కువ తింటే మాత్రం మలబద్దకం వ‌స్తుంది.

  1. సాన మీద అర‌గ‌దీసిన ప‌టిక‌బెల్లం పొడి, మంచి గంధంల‌ను ఒక్కొక్క‌టి 24 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. అంతే మొత్తంలో తేనెను తీసుకుని ఈ మూడింటినీ 60 గ్రాముల‌ బియ్యం కడిగిన నీటిలో కలిపి పూటకు ఒక సారి తీసుకుంటే రక్త, జిగట విరేచనాలు త‌గ్గుతాయి. దీంతో శ‌ర‌రీంలో ఏర్ప‌డే మంటలు కుడా తగ్గుతాయి .
    మూడు, నాలుగు దొండ పండ్ల‌ను పటికబెల్లం పొడిలో అద్దుకొని తింటూ ఉంటే నాలుగు పూటల్లో దగ్గు త‌గ్గుతుంది.
  2. పటికబెల్లం పొడి 36 గ్రాములు, దోరగా వేయించిన శొంఠి పొడి 48 గ్రాములు, దోరగా వేయించిన మిరియాల పొడి 30 గ్రాములు తీసుకుని ఈ మూడు చూర్ణాల‌ను బాగా కలిపి అనంతరం వ‌చ్చే చూర్ణాన్ని పూటకు 3 గ్రాముల చొప్పున‌ 6 గ్రాముల‌ నెయ్యిలో కలిపి రెండు పూటలా తినాలి. దీంతో అతిమూత్ర వ్యాధి నివారణ అవుతుంది.
  3. పటికబెల్లం పొడి 3 గ్రాములు, పుదీనా ఆకుల రసం ఒక టీ స్పూన్ కలిపి రోజూ రెండు లేక మూడు పూటలా సేవిస్తూ ఉంటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి. ఈ చిట్కా దద్దుర్లు వచ్చినపుడు కూడా ఉపయోగించుకోవచ్చు.
  4. కొంచెం పటికబెల్లం చూర్ణాన్ని నీటిలో కలిపి కరిగించి వడపోసి ఆ నీటిని రెండు లేక మూడు చుక్కలు కళ్ల‌లో వేసుకుంటే క‌ళ్ల‌ కలకలు త‌గ్గిపోతాయి .
  5. సొరకాయ ముక్కలను దంచి ర‌సం తీయాలి. దాన్ని 60 గ్రాముల మోతాదులో తీసుకుని అందులో 24 గ్రాముల‌ పటికబెల్లం పొడి కలిపి రోజు రెండు పూటలా తాగుతూ ఉంటే వారం రోజుల్లో కామెర్లు తగ్గిపోతాయి.
  6. అరటిపండును పటికబెల్లం పొడితో అద్దుకొని తింటూ ఉంటే నీళ్ల విరేచనాలు త‌గ్గుతాయి.
  7. నిమ్మపండు ముక్క మీద కొద్దిగా పటికబెల్లం పొడి అద్ది బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే వాంతులు తగ్గిపోతాయి .
  8. పటికబెల్లం ముక్కను నీళ్లతో అరగదీసి ఆ గంధాన్ని తేలు కుట్టిన చోట రాసి మర్దన చేస్తూ ఉంటే 6 నిమిషాల్లో తేలు విషం దిగిపోతుంది.
  9. పటికబెల్లం పొడి , తామరపువ్వు రేకులు కలిపి ముద్దగా నూరి ఉదయం పూట మాత్రమే తింటూ ఉంటే రక్తం పడే మూల వ్యాధి త‌గ్గుతుంది.
  10. పటికబెల్లం పొడి 3 గ్రాములు, కొబ్బరి కోరు 3 గ్రాములు కలిపి పిల్లలుకు తినిపిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి .

1i. నిప్పుల మీద కొంచం పటికబెల్లం పొడిని, పసుపు పొడిని చల్లి దాని వాసన రెండు పూటలా పీలుస్తూ ఉంటే జలుబు, పడిశం తగ్గిపోతాయి .

  1. పాలల్లో పటికబెల్లం పొడి క‌లిపి తాగుతూ ఉంటే బలహీనత‌ వల్ల వచ్చిన దాహం త‌గ్గుతుంది.
  2. వేడివేడి పాలల్లో పటికబెల్లం పొడి కలిపి రెండు లేక మూడు పూటలా తాగితే అతిగా మాట్లాడటం వలన వ‌చ్చే గొంతు బొంగురు తగ్గిపోతుంది.