Mana Aksharam
  • Home
  • Recipes
  • పనీర్ బేబీ కార్న్ లాలిపాప్స్
Homepage-Slider Recipes

పనీర్ బేబీ కార్న్ లాలిపాప్స్

కావలసిన వస్తువులు:

బంగాళ దుంపలు – 2
బేబీ కార్న్ – 6
పనీర్ – 1/4 కప్పు
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 4
కొత్తిమిర – 3 స్పూన్స్
అల్లంవెల్లుల్లిముద్ద – 1 స్పూన్
సోయాసాస్ – 1/4 స్పూన్
అజినొమొటొ – చిటికెడు
కార్న్‌ ఫ్లోర్ – 3 స్పూన్స్
మైదా – 1/2 కప్పు
మిరియాల పొడి – 1/2 స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి

తయారుచేసే విధానం :


బంగాళదుంపలను మెత్తగా ఉడికించి చల్లారాక పై తొక్క తీసి ఒక గిన్నెలో వేసి మెత్తగా చిదపాలి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమిర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. పనీర్ కూడా సన్నగా తురిమి ఇందులో కలపాలి. తర్వాత అల్లంవెల్లుల్లి ముద్ద, అజినొమొటొ, మిరియాలపొడి, సోయాసాస్, కార్న్‌ఫ్లోర్ వేసి మొత్తం బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని కొద్దిగా పెద్ద సైజు నిమ్మకాయలంత ఉండలు చేసుకోవాలి. బేబీకార్న్ లావుగా ఉన్నవైపు ఈ మిశ్రమాన్ని కొంచెం పెట్టి గుండ్రంగా చుట్టాలి. దాన్నివత్తుతూ కొంచెం వెడల్పు చేసి మైదా పిండిలో దొర్లించాలి. మొత్తం అన్నింటిని ఇలామైదాలో దొర్లించి పక్కన పెట్టుకొవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండి పెట్టినూనెపోసి వేడి అయ్యాక పైన తయారు చేసుకున్న వాటిని గోల్డ్ కలర్ వచ్చే వరకువేగించాలి. అంతే పనీర్ లాలిపాప్స్ రెడీ. వీటికి టమాటా సాస్‌ మంచి కాంబినేషన్.

Related posts

పవన్ పై మండిపడ్డ జగన్..కొత్త కారును మార్చేసినట్టు పెళ్లాలను మార్చేస్తాడు

admin

జగ్గారెడ్డికి బెయిల్‌ మంజూరు..!

admin

62 ఏళ్ల తర్వాత ఏపీలో హైకోర్టు..!

admin