కావల్సినవి: పల్లీలు – కప్పు, టొమాటో, ఉల్లిపాయ – ఒక్కోటి చొప్పున, నిమ్మరసం – చెంచా, కొత్తిమీర – కట్ట, పచ్చిమిర్చి ముక్కలు – అరచెంచా, కారం, చాట్‌మసాలా – అరచెంచా చొప్పున, ఉప్పు – తగినంత.
తయారీ: పల్లీలను ఓ గిన్నెలోకి తీసుకుని కొద్దిగా ఉప్పూ, నీళ్లు పోయాలి. అరగంట అయ్యాక కుక్కర్లో ఉడికించి తీసుకోవాలి. పల్లీల్లోని నీళ్లు వంపేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలిపితే చాలు.
పోషకాలు: దీన్నుంచి మాంసకృత్తులూ, విటమిన్లు, ఖనిజాలూ, మోనో శాచురేటెడ్ కొవ్వులూ అందుతాయి.
కప్పు పల్లీల నుంచి.. 24 గ్రా పిండిపదార్థాలు, 72 గ్రా కొవ్వు, 38 గ్రా మాంసకృత్తులు అందుతాయి.

peanut tomato and onion salad for evening snack