Mana Aksharam
  • Home
  • Lifestyle
  • పిల్లలో ఒత్తిడికి టీవీనే కారణం..!
Lifestyle

పిల్లలో ఒత్తిడికి టీవీనే కారణం..!

tv is the main reason for stress in children

పుట్టుకతో అంగవైకల్యం, మానసిక రోగాల్తో పుట్టిన శిశువుల్ని కొంతవరకు బాగు చేయగలం కానీ నేటితరం పిల్లలు రకరకాల మానసిక రోగాలకు గురవుతూ  ఇంటా,బైట కంటినలుసుల్లా తయారవుతున్నారు. మారుతున్న నేటి కుటుంబ, సమాజ పరిస్థితులు, టివి, కార్టూన్‌ పాత్రలు, నేరాల కథలు చిన్నారుల్ని బాగా వత్తిడికి గురిచేసి అదేమిటో చూద్దామా, చేద్దాం అనే ఆలోచనల్ని రేపుతున్నాయి. కార్టూన్స్‌ పెట్టేసి తమ పని తాము చేసుకుంటూ అమ్మయ్య! కాస్త రిలీఫ్‌గా ఉంది అని నడ్డివాల్చే అమ్మా,నాన్నల కాలం ఇది. పిల్లల్లో మొండితనం,

సాధింపుకి బీజంవేస్తున్నారు పెద్దలే. అసలు శాస్త్రవేత్తలు ఏమంటారంటే, పిల్లలు,కోతులు స్వభావాలు దాదాపు ఒకటే. కోతుల్ని అనుకరించినట్లే పిల్లలు కూడా పెద్దల్ని అనుకరించి అనుసరిస్తారు.శక్తిమాన్‌కార్టూన్‌ కి ప్రభావితులై మేడపై నించి దూకే ప్రయత్నం చేసిన బాలలెందరో ఉన్నారు. అలాగే శిన్‌చైన్‌ అనే కార్టూన్‌తో ప్రభావం చెంది అమ్మా నాన్నల్ని ఉక్కిరిబిక్కిరి చేసిన పిల్లలున్నా రు.

పిల్లల్ని అపార్ట్‌మెంట్‌లో గోల గొడవ అని ఆడుకోనీయరు. పార్కుకి పంపరు. రోడ్లపై ట్రాఫిక్‌ యాక్సిడెంట్స్‌ జరుగుతాయని నేడు ఇంట్లోనే సెలవ్ఞ రోజున ఉంచేసి టి.వి. ఆన్‌ చేయటంతో వస్తోంది ఈ చిక్కంతా.కొత్తది తెల్సుకోవాలి, స్వయంగా చేయాలి అనే ఆతృతతో పిల్లలు ఇలా పిల్ల రాక్షసుల్లా మారుతున్నారు. అబ్బ పిల్లాడు మనకళ్లెదుటే ఉండి కార్టూన్స్‌ ఎంజాయ్ చేస్తున్నాడని ”అమ్మా నాన్న మురిసి ఊపిరిపీల్చుకుంటున్నారు కానీ, వాడి మానసికస్థితిలోని మార్పు చేర్పుల్ని గమనించటంలేదు. కొట్టుకోటం, ఎగరటం, దూకటం ఇవన్నీ కార్టూన్స్‌. కార్టూన్స్‌ అన్నీ పాశ్చాత్య ప్రభావాల్ని కల్గిస్తున్నాయి.

అమ్మానాన్నల్ని పేర్లతో పిల్చే సంస్కృతి వారిది. మరి మన పిల్లలూ అదే నేర్చుకునే దౌర్భాగ్యం నేడు మనకి దాపురించింది.టి.వి.కి అతుక్కుపోవడంతో నర్సరీ నుంచే కళ్ల జోడు వస్తోంది. ఆటలు, నవ్ఞ్వలు లేకపోవటంతో శరీరం లావ్ఞగా మారుతోంది.చదువ్ఞపై శ్రద్ధపెట్టరు. ఊహాలోకాల్లో విహరిస్తుంటారు.మరి పెద్దలు ఏం చేయాలి? వారిని రోజూ ఏపార్కుకో, గుడి దగ్గరకో నడిపిస్తూ తీసుకెళ్లాలి. కార్టూన్స్‌ ఒక అరగంట చూడనివ్వాలి. నిజంగా అలాంటి మనుషులుండరని అలాచేస్తే కాళ్లు చేతులు విరుగుతాయని బోధించాలి. పెద్దలే వారితో కాసేపు ఆడాలి. బాల్‌బాట్‌ స్కిప్పింగ్‌ లాంటివి. అసలు టి.వి.కి పిల్లల్ని బానిసలుగా చేయకుండా చూడాల్సిన బాధ్యత పెద్దలదే సుమా!

Related posts

మీ రిలేషన్‌షిప్‌ హ్యాపీగా సాగాలంటే..

admin

మీకు బ్రేకప్ చేపి వేరేవాళ్లతో డేటింగ్ చేస్తు మీకు కోపం తెపిస్తున్నారా ?? అయితే ఇదీ చదవండి…

admin

జిమ్ కు వెళ్ళేటపుడు ఇవి తప్పనిసరి!

admin