tips for cracked lips
tips for cracked lips

పెదవులు పగులుతున్నాయా?

చర్మం పైన 16 పొరలు ఉంటాయి.కానీ పెదవులపై ఉండే చర్మంపై మాత్రం 3 నుంచి 4 పొరలు మాత్రమే ఉంటాయి.అందువల్ల పెదవుల పగుళ్లు సర్వసాధారణం.దీన్ని పట్టించుకోకపోతే పెదవులు నల్లగా మారే అవకాశం కూడా ఉంది.

అందుకే పెదవుల ఆరోగ్యం కోసం చిన్న చిట్కాలు…

– సగం నిమ్మకాయ ముక్కపై పంచదార అద్ది పెదవులపై గుండ్రంగా రుద్దాలి.ఇలా పది నిమిషాల పాటు చేసి చల్లని నీటితో కడిగేస్తే పెదవుల తేమ పోకుండా ఉంటుంది.

– పెదవులపై ఆలివ్ ఆయిల్‌ని రోజుకి రెండుసార్లు రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

– కొబ్బరినూనెలో రెండు మూడు స్పూన్ల నిమ్మరసం వేసి పెదవులకు రాస్తే కూడా ఈ సమస్య తగ్గుతుంది.

– రోజూ పెదవులకు తేనె రాసుకుంటే అక్కడి చర్మం నుంచి తేమ వెళ్లిపోకుండా కాపాడుతుంది.పగిలిన పెదవులకు ఇన్‌ఫెక్షన్ రాకుండా కూడా తేనె నివారిస్తుంది.

– రోజూ రెండు సార్లు మీగడ రాసుకున్నా పెదవులు మృదువుగా తయారవుతాయి.