శివ అనే పదం మంగలకరం…శుభప్రదం. కైలసనాదుడైన ఆ పరమేశ్వరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది. భోళా శంకరుడు…ఈశ్వరుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి. యావత్ సృష్టిని నడిపించే ఆ శంభుడే అనుగ్రహం పొందాలంటే ఏమి చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. కలియుగ దేవుడు శ్రీనివాసుడే అప్పు ఇప్పించిన మహాశివుడు ఐశ్వర్యకారకుడు అలాగే మహాశివుడిని పూజిస్తే సకల దారిద్రాలు పోయి ఐశ్వర్యవంతులం అవుతాము.
- దారిద్ర్యం మరియు ఆర్ధిక సమస్యలు పోవాలంటే ఈ రకంగా చేయండి.
- ముందుగా సోమవారం తలస్నానం చేయాలి
- తర్వాత శివుడి లింగం లేదా పటం విభూతి సమర్పించాలి
- ఆపైన శివాష్టకం స్తోత్రం జపించాలి
- పైన చెప్పిన స్తోత్రం చదివిన తర్వాత శివుడికి పాలు మరియు నీళ్ళు సమర్పించాలి
- మీ ఇంట్లో కనుక శివలింగం ఉంటె కొద్దిగా నీళ్ళు రోజు అభిషేకం చేసి ఆ తర్వాత అది ప్రసాదంగా తీసుకొని కుటుంబానికి తీర్ధంగా ఇవ్వాలి.
- ఒకవేళ మీ ఇంట్లో శివుడి లింగం లేకుండా ఫోటో ఉన్నట్లు అయితే అయన ఫోటో ముందు పాలు, నీళ్ళు రాగి మరియు వెండి గ్లాసుల్లో సమర్పిస్తే మీకున్న ఆర్ధిక భాధలు తొలిగిపోయి, ఐశ్వర్యవంతులు అవుతారు.