Mana Aksharam
  • Home
  • Entertainment
  • ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూత
Breaking Cinema Entertainment Headlines Homepage-Slider

ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న బాపినీడు.. హైదరాబాద్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. విజయ బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. 1936 సెప్టెంబర్ 22న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రులో బాపినీడు జన్మించారు. ఏలూరు సీఆర్ఆర్ కాలేజీలో బీఏ పూర్తిచేసిన బాపినీడు.. ‘విజయ’ అనే ఎంటర్‌టైన్మెంట్ మ్యాగజైన్‌ను స్థాపించారు. ఆ తరవాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. 

‘డబ్బు డబ్బు డబ్బు’ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్న బాపినీడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందించారు. చిరంజీవితో ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మగ మహారాజు’, ‘మహానగరంలో మాయగాడు’, ‘హీరో’, ‘మగధీరుడు’ సినిమాలతో పాటు మెగాస్టార్ వందో చిత్రం ‘ఖైదీ నంబర్ 786’ను కూడా విజయ బాపినీడే తెరకెక్కించడం విశేషం. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ సినిమానే. చిరంజీవి తరవాత రాజేంద్ర ప్రసాద్‌తో బాపినీడు అత్యధిక సినిమాలు తెరకెక్కించారు. శోభన్‌బాబు, క్రిష్ణ, మోహన్‌బాబు వంటి సీనియర్ నటులతోనూ పనిచేశారు. 

Related posts

అప్పడాలు అమ్ముతున్న బాలీవుడ్ హీరో

Manaaksharam

ఈ బిగ్ బాస్ ఏందీబై:వీహెచ్

Manaaksharam

కోర్టులో జగన్ చొక్కా!

admin