bombay halwa receipe in telugubombay halwa receipe in telugu
bombay halwa receipe in telugu

బొంబాయి హల్వా తయారీ

కావలసినవి
బొంబాయిరవ్వ: కప్పు, పంచదార: కప్పు, నెయ్యి: ఒకటిన్నర కప్పులు, సిట్రిక్‌ ఆమ్లం: పావుటీస్పూను, బాదం: అరకప్పు(నానబెట్టి పొట్టు తీసి ముక్కలుగా చేయాలి), పిస్తా: పావుకప్పు, యాలకులపొడి: అరటీస్పూను, కుంకుమపువ్వు: తగినంత

తయారుచేసే విధానం 
* బొంబాయిరవ్వను మూడు గంటలపాటు నానబెట్టాలి.
* తరవాత రవ్వ చేతుల్లోనుంచి జారిపోకుండా జాగ్రత్తగా మూడుసార్లు కడిగి కాసేపు పక్కన ఉంచాలి. నీరు పైకి తేరుకున్నాక మళ్లీ వాటిని వంపేసి, రవ్వను మాత్రం మిక్సీలో వేసి కాసిని నీళ్లు పోసి రుబ్బాలి.
* మందపాటి బాణలిలో కప్పు నెయ్యి వేసి వేడెక్కాక మళ్లీ చల్లార్చాలి. ఇప్పుడు అందులో మెత్తగా రుబ్బిన రవ్వను వేసి నెమ్మదిగా కలపాలి. ఇప్పుడు దీన్ని స్టవ్‌మీద పెట్టి కలుపుతూ ఉడికించాలి. అది ఉడికేటప్పుడు మిగిలిన నెయ్యిని కొంచెంకొంచెంగా వేస్తూ కలుపుతుండాలి. మిశ్రమం చిక్కబడ్డాక పంచదార వేసి మళ్లీ కలుపుతూ ఉడికించాలి. ఇప్పుడు ఇది చిక్కబడి అంచుల దగ్గర నెయ్యి బయటకు వస్తుండగా స్టవ్‌ ఆఫ్‌ చేసి సిట్రిక్‌ ఆమ్లం వేసి, మిశ్రమాన్ని బాగా కలిపి పిస్తా, బాదం పలుకులు కూడా వేసి కలపాలి. ఇప్పుడు నెయ్యి రాసిన ట్రేలోకి మిశ్రమాన్ని వంపి చల్లారాక ముక్కలుగా కోయాలి.