బ్లఫ్ మాస్టర్ హిట్టా ఫట్టా?

యంగ్ టాలెంటెడ్ ఆక్టర్ సత్య దేవ్, ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ నందిత శ్వేతా హీరో హీరోయిన్లు గా తమిళ్ సూపర్ హిట్ చిత్రం శతురంగ వెట్టై ఆధారంగా బ్లఫ్ మాస్టర్ సినిమాని గోపి గణేష్ అనే యువ దర్శకుడు తెరకెక్కించారు.
ట్రైలర్ లో డైలాగ్ డెలివరీతో సినిమా పై ఉఊహల్నీ ఆమాంతం పెంచేసాడు సత్య దేవ్. డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది అనే కాన్సెప్ట్ తో డిఫరెంట్ గా ఈ సినిమాని తెరకెక్కించారు.
మరి ఏ మాత్రం కమర్షియల్ హైప్ లేని ఈ సినిమాని ప్రేక్షకులు ఏ విధంగా స్వీకరించారో మనం ఈ రివ్యూలో చూద్దాం.
కథ కధనం విశ్లేషణ
సినిమాలో పాటలు, డైలాగ్లు, ఫైట్లతో పాటు కధలో ఒక నీతిని జోడించడం అంత తేలికేమి కాదు. మరి అలంటి సినిమా కాన్సెప్టునే తీసుకోని కథను మల్చుకున్నాడు దర్శకుడు గోపి గణేష్.
మధ్య తరగతి కుటుంబాలకి డబ్బుని ఎరగా వేసి అదే మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ధనికుడు ఎలా అవుతాడు. చివరికి చట్టానికి ఎలా దొరుకుతాడు.. దానినుండి బయటికి ఎలా వస్తాడు అనే కదా చుట్టూ సినిమా తిరుగుతుంది.
కొత్త హీరో అనే భావన సినిమా చూస్తున సగటు ప్రేక్షకుడికి ఎక్కడ కలగదు.ఇక హీరోయిన్లు అంటే కేవలం అందాల ఆరబోతకే అనే అభిప్రాయాన్ని తుడిచిపెట్టేలా నందిత శ్వేతా తన పాత్రను చేసింది. ఒక లవర్ గా, మంచి ఇల్లాలిగా తన పాత్ర ఆకట్టుకుంది.
ఇక దర్శకుడు కూడా ఎక్కడ తడపడకుండు తాను ఎంచుకునే సినిమా లైన్ ని పర్ఫెక్ట్ గ ప్రెసెంట్ చేసాడనే చెప్పాలి. సస్పెన్స్ ని చక్కగా క్రియేట్ చేయగలిగాడు. ప్రేక్షకులను 2 గంటల సేపు కుర్చీలకి అతుకుపోయేలా చేయడంలో సఫలమయ్యారు.
ఇక అర్జున్ రెడ్డి తో విజయ్ దేవరకొండలా,ఆర్ ఎక్స్ 100 సినిమా హీరో కార్తికేయల ఒక పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ హీరో తెలుగు ఇండస్ట్రీకి దొరికేసాడనే చెప్పాలి.
ఇక టాలెంటెడ్ హీరోకి సరైన కదా దొరకడం, ఎలాంటి కమర్షియల్ సినిమాలు రిలీజ్ అవ్వకపోడం హీరోకి మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. ఇక ఈ సంవత్సరానికి చిన్న బడ్జెట్ హిట్ సినిమాగా ఇది ఉంటుంది అనే విషయాన్నీ గంటాపధంగా చెప్పుకోవచ్చు.

రేటింగ్: 3/5