uterus rupture symptoms and medication
uterus rupture symptoms and medication

యూట్రస్ రప్చర్ అంటే ఏంటి?

28 వారాల తర్వాత గర్భాశయం చీలడాన్ని యూట్రస్‌ రప్చర్‌ అంటారు. 28 వారాలకు ముందు గర్భధారణ తొలి ట్రైమిష్టర్‌లో యూట్రస్‌ రప్చర్‌ అవుతేదాన్ని ఫర్‌ఫోరేషన్‌ అంటారు. నెల నిండిన తర్వాత కాన్పునొప్పులు రాకముందే, ముందు సిజేరియన్‌ ఆపరేషన్‌ అయిన వాళ్లలో యూట్రస్‌ రప్చర్‌ అయితే దాన్ని కేటస్ట్రోపిక్‌ రప్చర్‌ అంటారు. సెకండ్‌ ట్రైమిష్టర్‌లో యూట్రస్‌ కన్నా ఎండో సర్వైకల్‌ రప్చర్‌ అవుతుంది. ముందు సిజేరియన్‌ అయినప్పుడు, సెకండ్‌ ట్రైమిష్టర్‌లో అబార్షన్‌ అయినప్పుడు అడ్హషన్స్‌ తయారై మూత్రాశయంకు, ఓమింటమ్‌కు స్కార్‌కు అతుక్కున్నప్పుడు యూట్రస్‌ రప్చర్‌ అవుతుంది. ఇది స్త్రీలల్లో సీరియస్‌, ఎమర్జెన్సీ కేసు అని చెప్పవచ్చు.

ఇది మయోమెట్రియమ్‌ గోడల్ని బట్టి ఉంటుంది. గర్భసంచి మూడు పొరలు చీలినప్పుడు ఉమ్మనీటి సంచి కూడా అబ్డామినల్‌ కేవిటీలోకి పోతుంది. ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదం.

కారణాలు:

1.ముందు సిజేరియన్‌ చేసినచోట బలహీనంగా ఉండటం. ఇది ఆపరేషన్‌ వల్ల గాయం సరిగా మానకపోవడం వల్ల ఆపరేషన్‌ అయిన ఆరునెలలకే మరల గర్భం రావడం వల్ల, తర్వాత గర్భంలో కవలలున్నప్పుడు, ఉమ్మనీరు అధిక పరిమాణంలో ఉన్నప్పుడు జరుగుతుంది.

2.అడ్డుపడు ప్రసవం అబ్‌స్ట్రక్టెడ్‌ లేబర్‌లో లోయర్‌ సెగ్మెంట్‌ ఎక్కువగా పోవటం వల్ల పల్చగా అయి రప్చర్‌ అవుతుంది.

3. ప్రసవం చేసేటప్పుడు వర్షన్‌, డిస్ట్రక్టివ్‌ ఆపరేషన్‌, భుజాలు కాన్పు సమయంలో వచ్చి ప్రసవం కష్టం కావడం వల్ల ఎక్కువ గాయాలయినప్పుడు రప్చర్‌ అవుతుంది.

4. ఆక్సిటోసిన్‌ మందుని ఎక్కువగా వాడినప్పుడు, ఇంట్రామస్కులర్‌గా తీసునప్పుడు రప్చర్‌ అవుతుంది.

5. డిఅండ్‌సి అబార్షన్‌, మయోమెక్టమీ, మాయని చేత్తోతీయడం సిజేరియన్‌ వంటి గర్భసంచి ఆపరేషన్ల వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది.

6. గర్భిణీగా ఉన్నప్పుడు కిందపడిన, ఆక్సిడెంట్స్‌ అయిన దెబ్బలు తగిలిన గర్భసంచి సరిగా వృద్ధి కాకపోయినా అబ్‌స్ట్రక్టెడ్‌ కాన్పు వల్ల ఇండక్షన్‌ లేబర్‌, సర్వైకల్‌ లానిరేషన్స్‌ (గాయాలు) డెలివరీ సరిగా చేయకపోయినా, గర్భస్రావాలు ఎక్కువగా అయినప్పుడు ప్లాసెంటా ఇంక్రీటావంటి లోపాలు పిల్లల్లో అబ్‌నార్మల్‌గా అంగవైకల్యం ఏర్పడటం, తల పెద్దదిగా ఉండటం, మల్టిపుల్‌ ప్రెగ్నెన్సీ, కొరియో కార్సినోరూ వంటి వ్యాధుల వల్ల కూడా గర్భసంచి రప్చర్‌ ఉంటుంది. ప్రతి పదివేల కేసుల్లో ఒకరికి వస్తుంది. విధానాలు : ఇది మూడు విధాలుగా జరుగుతుంది. స్పాంటేనియస్‌ రప్చర్‌: గర్భసంచి వీక్‌గా ఉండటం వల్ల, ఎక్కువ కాన్పులు అయిన వారిలో, పుట్టుకతో గర్భసంచి లోపాలున్నప్పుడు గర్భసంచి పై సెగ్మెంట్‌లో నెలలు నిండాక ఈ రకం రప్చర్‌ అవుతుంది. కాన్పు సమయంలో అబ్‌స్ట్రక్టివ్‌ వల్ల, ఎక్కువసార్లు కాన్పులు అయినప్పుడు గర్భసంచి గోడలు బలహీనమైనప్పుడు ఈ స్పాంటేనియస్‌ రప్చర్‌ అవుతుంది. స్కార్‌ రప్చర్‌: సిజేరియన్‌ అయిన చోట స్కార్‌ (కుట్లదగ్గర) కింది భాగంలో అడ్డంగా చేసిన వారిలో 1-2% నిలువుగా చేసిన వారిలో 5-10 రెట్లు ఎక్కువగా వస్తుంది. హిస్టరెక్టమీ అయినవారిలో కూడా స్వార్‌ రప్చర్‌ ప్రతి 10,000మందిలో ఆరుగురికి అవుతుంది. స్కార్‌ కొద్దిగా సపరేట్‌ అయినట్లనిపిస్తుంది. కాని విసరల్‌ పెరిటోనియం అతుక్కొని ఉండటం,

సాగదీసినట్లుండి అతుక్కుని ఉంటుంది. అమెట్రోజెనిక్‌ : ఇది కింద పడినప్పుడు, ఆక్సిడెంట్లు అయినప్పుడు కాన్పు కష్టమైన ఇంజక్షన్‌ లేబర్‌, ఆబార్షన్‌ అయిన ఆక్సిటోసిస్‌ డోస్‌ ఎక్కువగా ఇచ్చినప్పుడు ఈ రకం రప్చర్‌ వస్తుంది. పెరిటోనియం కూడా ఎఫెక్ట్‌ అయితే దాన్ని కంప్లీట్‌ రప్చర్‌ అనీ, పెరిటోనియం ఎఫెక్ట్‌ కాకపోతే దాన్ని ఇన్‌కంప్లీట్‌ రప్చర్‌ అనీ అంటారు. దీంట్లో ప్లాసెంటా పిండం రెండూ గర్భసంచిలో ఉంటుంది. కంప్లీట్‌ రప్చర్‌లో పిండం గర్భసంచిలో ఉన్నా, ప్లాసెంటా మాత్రం జారిపోయి ఉంటుంది. గర్భసంచి ముడుచుకొని ఉంటుంది.

లక్షణాలు:
ఏదో చిరిగినట్లు అనిపించడం, అనీజీగా ఇబ్బం దిగా ఉండటం, నొప్పులు ఆగిపోవడం, ఉన్నట్టుండి తీవ్రంగా కడుపునొప్పి రావటం, ఊపిరాడక పోవటం, గర్భసంచి కండరాలు పటుత్వం లేకపోవడం, ఊపిరి తీసుకున్నప్పుడు ఛాతిలో భుజాలనొప్పి రావటం, రక్తస్రావం కావడం, రక్తం గడ్డలేర్పడానికి ముఖం పాలిపోయి ఉంటుంది. బిపి తక్కువగా ఉండటం, గుండెవేగం ఎక్కువగా ఉండటం, షాక్‌, పిండం కదలికలు తగ్గడం లేదా అబ్‌నార్మల్‌గా ఉండటం, పిండం తలకింద ఉండేది పై భాగంలో ఉండటం కుట్లు వేసిన చోట సూదితో గుచ్చినట్లు నొప్పి రావటం కడుపు ముట్టుకుంటే నొప్పి ఉంటుంది. అదురు లక్షణాలు, టోనిక్‌ కంట్రాక్షన్స్‌, బాండిల్స్‌ డిగ్‌ ఏర్పడుతుంది.ఇది తల్లి బిడ్డ ప్రాణాలకు హాని కలిగిస్తుంది. కాంప్లికేషన్స్‌: ఇన్ఫెక్షన్‌, మూత్రనాళాలు డామేజ్‌ కావటం, ఉమ్మనీటిలో గాలిబుడగలు ఏర్పడటం, మెటర్నల్‌ హామరేజ్‌ , పిట్యూటరీ ఫెయిల్యూర్‌ ఫెరిటానిక్‌ రక్తస్రావం వల్ల షాక్‌, మరణం వంటి కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి.

చికిత్స:
గర్భసంచి రిపేర్‌ చేయడం, వెంటనే లాప్రోస్కోపీ హిస్టోక్టమీ (గర్భసంచి తీసివేయడం), రక్తం ఎక్కించడం చేయాలి. వెంటనే రక్తస్రావాన్ని అరికట్టాలి. కాళ్లవద్ద ఎత్తు పెట్టాలి. షాక్‌, ఇన్ఫెక్షన్‌ తగ్గడానికి ఆంటీబయాటిక్స్‌ మందుల్ని ఇవ్వాల్సి ఉంటుంది. వెంటనే నిపుణులైన డాక్టర్ని సంప్రదించి త్వరగా వ్యాధి నిర్ధారణ చేసి వెంటనే ఆపరేషన్‌ చేయడం మంచిది. ఎంతత్వరగా హాస్పిటల్‌లో చేర్పిస్తే అంత మంచిది. తల్లి బిడ్డలకు ప్రాణహాని తప్పుతుంది

apteka mujchine for man ukonkemerovo woditely driver.