Home / Entertainment / రాజమౌళి తనయుడి వివాహ వెన్యు ఇదే అట..!
hotel fairmont jaipur
hotel fairmont jaipur

రాజమౌళి తనయుడి వివాహ వెన్యు ఇదే అట..!

ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ త్వరలో తన స్నేహితురాలు పూజా ప్రసాద్ ను వివాహం చేసుకోబోతున్నాడనే విషయం తెలిసిందే.  పూజ ఎవరంటే జగపతి బాబు సోదరుడు రామ్ ప్రసాద్ కూతురు.  సెప్టెంబర్ మొదటివారంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది.  ఇరుకుటుంబాలకు చెందిన పెద్దల  డిసెంబర్ 30 వ తారిఖున వివాహనికి ముహూర్తం ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ జంట పెళ్ళి చేసుకోబోయే లొకేషన్… వేదిక వివరాలు బయటకు వచ్చాయి.  రాజాస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లో ఈ జంట వివాహం జరుగుతుందట.  జైపూర్ లో మొఘల్ రాజుల భవనం స్టైల్లో ఉండే హోటల్ ఫెయిర్ మాంట్ లో జరుగుతుందట.  ఇంద్రభవనం లాంటి ఈ 7 స్టార్ హోటల్ చాలా ఫేమస్. ఎన్నో బాలీవుడ్ చిత్రాల షూటింగ్ కూడా ఇందులో జరిగింది.  దాదాపు 250 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ హోటల్ ఉంది. ఎలాగూ 7 స్టార్ హోటల్ కాబట్టి అన్నీ వివాహానికి హాజరయ్యే అతిథులకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి.

రాజమౌళి తన సినిమాల విషయంలోనే కాకుండా తనయుడి కళ్యాణం విషయంలో కూడా భారీ విజన్ తో ఆలోచించి ఈ లొకేషన్ ను ఫైనలైజ్ చేసినట్టుగా అనిపిస్తోంది కదా.  ఎంతైనా జక్కన్న తనయుడి వివాహం అంటే టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్ ప్రముఖులతో పాటుగా ఇతర రంగాలకు సంబంధించిన ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మరి ఆమాత్రం గ్రాండ్ గా లేకపోతే ఎలా?