Home / Breaking / వైసీపీలో విజయసాయిరెడ్డి కి కొత్త బాధ్యతలు !!

వైసీపీలో విజయసాయిరెడ్డి కి కొత్త బాధ్యతలు !!

విజయసాయిరెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి తర్వాత అంతటి పేరొందిన నేత. దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆడిటర్‌గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి.. అటు పిమ్మట వైఎస్‌ కుటుంబానికి దగ్గరవారయ్యారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపించారు జగన్‌మోహన్‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తరచూ అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా బాగా పాపులర్ అయిన విజయసాయి.. వైసీపీలో కీలక నేతగా మారిపోయారు. అందుకే పార్టీలో అందరికంటే ఆయననే ఎక్కువగా నమ్ముతున్నారట వైసీపీ అధినేత. ఏమైనా బాధ్యతలు అప్పగించాలన్నా.. కీలక నిర్ణయాలు తీసుకునే సందర్భంలో సలహాలు తీసుకోవాలన్నా జగన్.. ముందుగా విజయసాయినే పలకరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

రాయలసీమ ప్రాంతంలో తన మార్కును చూపించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో మెరుగవ్వాలని భావిస్తోంది. అందుకోసం ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి. పార్టీలోకి కీలక నేతలను తీసుకురావాలని ఎంపీ విజయసాయిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. ఇందులో భాగంగానే ఆయన.. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలను వైసీపీలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కూడా ఆయన టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. చోటా మోటా లీడర్ల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరితో విజయసాయి చర్చలు జరుపుతూ వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో చేరిన కొందరు నేతలతో పాటు, కదిరి అర్బన్ సీఐ గోరంట్ల మాధవ్, దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరడం వెనుక విజయసాయి చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి విజయసాయి బాగానే ప్రభావం చూపుతున్నారన్న మాట.