how to get blessings of lord shiva
how to get blessings of lord shiva

శివుని అనుగ్రహం పొందండిలా…!!

ఎంతోమంది ఎన్నో రోజులా నుండి కొన్ని బాధలు ఎన్ని ప్రయత్నాలు చేసిన తీరవు. వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా వారికి అర్ధం కాదు. మీరు మీ కష్టాలు తీరడానికి ఎన్నో కష్టాలు చేసి అలసిపోయినట్లయితే ఇప్పుడు నేను చెప్పే విధంగా శివున్ని పూజించి మీ దోషాలను, పాపాలను తొలగించుకోండి. శివునికి ఎంతో ప్రీతికరమైన అకులలో ఒక్కటి ఉమ్మెత్త పువ్వు. ఒక ఉమ్మెత్త పుష్పాన్ని శివుని దగ్గర పెట్టి వేడుకుంటే మోక్షం లభిస్తుంది. మాంగల్య భాగ్యం కలగాలి అనుకొనే వారు శివున్ని ఉమ్మెత్త పువ్వులతో అర్చిస్తే కోరిక నెరవేరుతుంది. ఉమ్మెత్త పువ్వులతో తాయారు చేసిన మాలతో శివున్ని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయి. ప్రదోష కాలంలో శివున్ని పూజిస్తే జాతక దోషాలు ఏమున్న తొలగిపోతాయి. సర్ప దోషంతో ఎలాంటి దోషాలు ఉన్న వాటి నుండి బయటపడుతారు. నెలలో రెండు సార్లు ప్రదోష కాలం వస్తుంది. పౌర్ణమి, అమావాస్యాలకు ఒక్క రోజు ముందు ప్రదోషం వస్తుంది. ఈ రోజులలో దేవతలందరూ శివున్ని స్థితిస్తారని పురాణాలూ చెబుతున్నాయి. ఆ సమయంలో శివున్ని పూజిస్తే శివుని అనుగ్రహంతో పాటు సమస్త దేవతలా అనుగ్రహం లభిస్తుంది. ప్రదోషం రోజున సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్య నందీశ్వరనుని పూజించాలి. అంతే కాకుండా ఆరోజు వ్రతం ఆచరించి సాయంత్రం ఆరు గంటల తరువాత భోజనం చేయడం మంచిది. ఇలా చేయడం వలన ఆధ్యాత్మికంగా, ఆరోగ్య పరంగా మంచి జరుగుతుంది. శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం. ఆ రోజున ఆయనకు పాలాభిషేకం చేయడం వలన ఎంతో మేలు జరుగుతుంది. బిల్వపత్రం, కొబ్బరి నీళ్ళతో శివునికి అభిషేకం చేస్తే ఇతిబాధాలు  తొలగిపోతాయి. అదే రోజున ఉమ్మెత్త పువ్వులతో అభిషేకం చేస్తే సమస్త దోషాలు, ఏడు జన్మల పాపాలు, బ్రహ్మ హత్యా దోషాలు  తొలగిపోతాయి. శనివారం వచ్చే ప్రదోషం రోజులలో శివున్ని పూజిస్తే ఇతి బాధలు, అష్టకష్టాలు తొలగిపోతాయి. ఆలాగే మామిడి పళ్ళ రసంతో శివునికి అభిషేకం చేయడం వలన ధనదాన్యాలు చేకురుతాయి. ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మత్త పుష్పం అంటే శివునితో గణనాధునికి కూడా ఎంతో ఇష్టం. దుర్గాదేవిని ఉమ్మెత్త పువ్వులతో పూజిస్తే దారిద్రం తొలగిపోయి మంచి జరుగుతుంది.