శ్రీశైలం లోయలోకి దూసుకెళ్లిన బస్సు.

 

జిల్లాలోని శ్రీశైలం సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం దగ్గరలోని చిన్నారుట్ల వద్ద ఓ ప్రైవేట్‌ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఘాట్‌ రోడ్డులో బస్సు ప్రహరీగోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే డ్రైవర్‌ చాకచక్యం వల్ల ఈ ప్రమాదం నుంచి ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్‌ చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణీకులను సురక్షితంగా బస్సులోనుంచి కిందకు దించారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ మహారాష్ట్రకు చెందినవారని పోలీసులు వెల్లడించారు