samantha latest news
samantha latest news

సమంత ఆ పాత్ర చేయట్లేదట

అక్కినేని వారి కోడలు సమంత పెళ్లి తరువాత హీరోయిన్ అని కాకుండా అందరికి ఒక మంచి నటిగా దగ్గరువుతోంది. అవకాశాలు ఎన్నో వస్తాయి కానీ అందరికి గుర్తుండిపోయే ఛాన్సులు రావడం చాలా అరుదు. కెరీర్ మొదట్లో క్యారెక్టర్స్ గురించి పెద్దగా పట్టించుకోకుండా సినిమాలు చేసిన సామ్ ఇప్పుడు మాత్రం తొందరెందుకు అన్నట్లుగా నిదానంగా ఆలోచిస్తు పరిస్థితికి తగ్గట్టు వర్క్ చేస్తోంది.

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ఒక కొరియన్ రీమేక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో 70 ఏళ్ల భామ్మగా.. అలాగే 20 ఏళ్ల భామలా సమంత ద్విపాత్రాభినయం చేయనుందని టాక్ వచ్చింది. ఇది నిజమే అయినప్పటికీ సమంత ఇప్పుడు మనసు మార్చుకుంది. ముసలి పాత్రలో కనిపిస్తే మార్కెట్ డ్యామేజ్ అనుకుందో ఏమో గాని చివరికి ఆ పాత్రకు మొదలవ్వకముందే ఎండ్ కార్డ్ పెట్టేసింది. అయినా ఆ ఏజ్ లో కనిపిస్తేనే కదా సినిమాపై అంచనాలు పెరుగుతాయి. అలాగే అభిమానులకు కూడా మంచి కిక్.

కానీ రిస్క్ ఎందుకని మొత్తానికి ప్రోస్తేటిక్ ప్రయోగం ఇబ్బందులను నుంచి సమంత తప్పించుకుంది. చిత్ర యూనిట్ కూడా టైమ్ తో పాటు కాస్ట్ పరంగా కూడా ఎక్కువగా ఖర్చు చేయడం ఎందుకు అని ఆలోచించి పెద్దావిడ పాత్ర కోసం సీనియర్ నటి లక్ష్మిని ఎంచుకున్నారని టాక్. ఒరిజినల్ కథలో నటించింది కూడా వేరు వేరు నటీనటులే..సో సినిమాలో సమంత ఎప్పటిలానే యువతిలా కనిపించనుంది. ఇక ఈ ప్రయోగాత్మక చిత్రంలో నాగ శౌర్య కీలకపాత్రలో నటిస్తున్నాడు.