Mana Aksharam
  • Home
  • Breaking
  • సైరా నరసింహారెడ్డిలో జగపతి బాబు న్యూలుక్
Breaking Cinema Homepage-Slider Top Read Stories

సైరా నరసింహారెడ్డిలో జగపతి బాబు న్యూలుక్

చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ చారిత్రాత్మక సినిమా సైరా నరసింహ రెడ్డి. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథను ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, నయనతార, తమన్నా వంటి విలక్షణ నటులు నటిస్తున్నారు.

ఫ్యామిలీ హీరో టెన్ గుర్తొచ్చే జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్ గా మారి ఇది మరో పునర్జన్మలా విలనిజం పండిస్తున్నారు. కొన్ని రోజులుగా సినిమాలో నటిస్తున్న స్టార్స్ పుట్టినరోజుని పురస్కరించుకొని వారికి సంబందించిన పాత్రలని చిత్ర యూనిట్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు జగపతి బాబు పుట్టినరోజు సందర్భంగా సైరా నరసింహారెడ్డిలో జగపతి బాబు లుక్ విడుదల చేశారు.

వీరారెడ్డి పాత్రలో నటిస్తున్న జగపతి బాబు లుక్ ఆకట్టుకునేలా ఉన్నది. భుజాల వరకూ జుట్టూ, బాగా పెరిగిన గడ్డం, మీసాలతో స‌రి కొత్త లుక్‌ లో కనిపిస్తున్నారు జగ్గూ భాయ్. ఇక ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా రిలీజ్ కానుంది. సైరా చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌ పై నిర్మిస్తున్నారు.

Related posts

గూఢచారి సినిమా: రివ్యూ రేటింగ్

admin

ఆళ్లగడ్డ లో అఖిల ప్రియకు షాక్!

admin

రాజధానిపై చంద్రబాబు కీలక ఆదేశాలు..!

admin