హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం!

హైదరాబాద్ నగరంలోని ఓ ఫాం హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. నగర శివారులోని శామీర్‌పేట్‌లో యువతులతో డాక్టర్లు ఈ పార్టీని నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి 11మంది డాక్టర్లును అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్లతో పాటు నలుగురు యువతులు పోలీసుల తనిఖీలో పట్టుబడ్డారు. పార్టీ నిర్వహిస్తున్న వారిని గజ్వేల్‌కు చెందిన డాక్టర్లుగా పోలీసులు గుర్తించారు. వారందరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.