ప్రశాంత్ కిషోర్ తాజా సర్వే.. వైసీపీ గెలుచుకునే సీట్లు ఇవే!

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఎన్నికలొస్తే తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తుందనే అంచనాలో నేతలుండటం సహజమే. కానీ ఖచ్చితంగా ఇన్ని సీట్లు వస్తుందని మాత్రం ఎక్కడా ప్రకటించరు. ఎందుకంటే, ఆ సంఖ్యకు కొద్దిగా అటు ఇటు అయితే పర్వాలేదు కానీ బాగా తేడా కొడితే మాత్రం సమాధానం చెప్పుకోలేరు. అయితే, చాలా అరుదుగా మాత్రమే పార్టీల అధినేతలు గెలుచుకోబోయే స్ధానాలపై ప్రకటనచేస్తారు.

1994 ఎన్నికల సందర్భంగా తిరుపతిలో ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీకి 227 సీట్లు వస్తాయని ప్రకటించారు. అదేమి లెక్క అని మీడియా అడిగితే రాకపోతే అడగండి అంటూ సవాలు విసిరి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఫలితాలు చూస్తే దాదాపు అన్నే సీట్లు వచ్చాయి. అటువంటిది చాలా రేర్ గా జరుగుతుంది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే జగన్ కూడా అటువంటి సాహసమే చేశారు. గొర్లగుంటలో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 137 స్ధానాల్లో గెలుస్తుందని ఢండా భజాయించి మరీ ప్రకటించారు. బహుశా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిషోర్ ఏమైనా సర్వేలు నిర్వహించి వేదిక ఇచ్చారా అన్న అనుమనాలు మొదలయ్యాయి. ఎందుకంటే, ప్రశాంత్ కొంతకాలంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సర్వేలు కండక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*