పట్టాలు తప్పిన ఫరక్కా ఎక్స్‌ప్రెస్‌: ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఫరక్కా ఎక్స్‌ప్రెస్‌ ఘోర ప్రమాదానికి గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 6 బోగీలు పట్టాలు తప్పాయి. ఆరుగురు ప్రయాణికులు చనిపోగా, దాదాపు 35 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ అలహాబాద్‌కు వెడుతుండగా రాయబరేలి, హరచాంద్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.

ఈ ప్రమాదంపై స్పందించిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర రైల్వేమంత్రి పియూష్‌ గోయల్‌ సహాయక చర్యలను చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. వారణాసి, లక్నో నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రమాదస్థలానికి తరలివెళ్లాయి. రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్విన్‌ లోహానీ సహాయ, రక్షక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అత్యవసర సమాచారం నిమిత్తం హెల్ప్‌లైన్‌ నంబర్లు అధికారులు ప్రకటించారు.

ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ నంబర్లు: దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్-బిఎస్ఎన్ఎల్-05412-254145, రైల్వే -027-73677
పాట్నా స్టేషన్ నం: బిఎస్ఎన్ఎల్-0612-2202290, 0612-2202291, 0612-220229, రైల్వే ఫోన్ నంబర్- 025-8328

ఎక్స్‌గ్రేషియా : ఈ ప్రమాదంలో చనిపోయినవారికి 2లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడినవారికి 50వేల రూపాయల ఎక్స్‌గ్రేషియాను సీఎం ప్రకటించారు.

apteka mujchine for man ukonkemerovo woditely driver.