తండ్రి ఆటోడ్రైవర్.. బిడ్డ టాప్‌ర్యాంకర్..

రేయింబవళ్లు నిద్రకోర్చి, ఆటో నడుపుతూ తన చదువుకోసం కష్టపడిన ఆ తండ్రికి కూతురు స్టేట్ ఫస్ట్ ర్యాంకును బహుమతిగా ఇచ్చింది. ఆటో నడిపితే వచ్చే 300 రూపాయలను కడుపు మాడ్చుకొని ఇంటి ఖర్చులు వెల్లదీసిన తల్లికి ఆ కూతురు బోలెడంత భరోసా ఇచ్చింది!

చదువడమంటే ఉత్తుత్తిగా కాదు.. కష్టపడి చదివి మనమేంటో చూపించాలని నిరూపించింది ఈ ఆటో డ్రైవర్ కూతురు పూనమ్ టోడి. ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసెస్ (జ్యుడిషీయల్) పరీక్షల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో టాపర్‌గా నిలిచి తన సత్తా ఏంటో చూపించింది. తల్లి లత. తండ్రి అశోక్ టోడి ఓ ఆటో డ్రైవర్. తన కూతురి చదువుకోసం రేయింబవళ్లు ఆటో నడిపేవాడు. వచ్చిన డబ్బులను ఇంట్లో ఇస్తే.. కుటుంబ అవసరాలను తగ్గించుకొని, కూతురి చదువు కోసం ఖర్చు చేసింది లత. వారి కష్టాన్ని వృథాగా పోనివ్వకుండా పట్టుదలతో చదివి పీసీఎస్ పరీక్షల్లో టాప్‌ర్యాంక్ సాధించింది పూనమ్. చిన్నప్పటి నుంచి కుటుంబ కష్టాలు తెలిసిన పూనమ్.. ఆర్థికంగా వెనుకబడిన వారికి న్యాయం అందేలా చూస్తానని అంటున్నది. ఆటోడ్రైవర్ కూతురు స్టేట్ ర్యాంక్ సాధించడంతో పలువురు ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

(నమస్తే తెలంగాణ కర్టెసీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*