అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని రివ్యూ

డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న హీరో ర‌వితేజ‌.ర‌వితేజ‌, శ్రీనువైట్ల అంటే ఇప్ప‌టికే మూడు హిట్స్ ఉన్నాయి.మ‌రి ర‌వితేజ‌, శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన నాలుగో చిత్రం `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని`. అయితే ఈ మ‌ధ్య శ్రీనువైట్ల‌కు స‌రైన హిట్స్ లేవు.మ‌రి అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని ఎలాంటి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నాడ‌నేది తెలుసుకోవాలంటే రివ్యూ చూడాల్సిందే…

రివేంజ్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కిన అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ అసలు క‌థ విష‌యానికి వ‌స్తే.. చాలా కాలం నుండి న్యూయార్క్‌ల‌తో స్థిర‌ప‌డిన‌.. రవితేజ (అమర్) – ఇలియాన (ఐశ్వర్య) పెరెంట్స్‌ను చంపాలని వారి సన్నిహితులు ప్లాన్ చేయడం నుంచి కథ మొదలవుతుంది.వారి ప్లాన్ ప్ర‌కారమే అమ‌ర్- ఐశ్వ‌ర్య‌ల ఫ్యామిలీ మెంబ‌ర్స్ మొత్తాన్ని చంపేస్తారు.దీంతో అమ‌ర్ త‌న త‌ల్లిదండ్రుల‌ను చంపిన వారి పై ప‌గ తీర్చుకుంటాడా.. చిన్న‌త‌నంలో విడిపోయిన ఐశ్వ‌ర్య‌ను క‌లుసుకుంటాడా అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెర‌పై చూడాల్సిందే.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. ర‌వితేజ ఫుల్ ఎన‌ర్జీతో అమ‌ర్, అక్బ‌ర్‌, ఆంటోని అనే పాత్ర‌ల‌ను చ‌క్క‌గా వేరియేష‌న్‌తో చేశాడు. ప‌గ తీర్చుకునే అమ‌ర్‌.. ప‌క్క‌వాడికి స‌హాయ‌ప‌డాల‌నుకునే అక్బ‌ర్‌… రోగుల‌కు వైద్యం చేసే డాక్ట‌ర్ అంటోని అనే పాత్ర‌ల్లో చ‌క్క‌టి వేరియేష‌న్ క‌న‌ప‌డుతుంది.

ఆరేళ్ల త‌ర్వాత తెలుగు తెర‌పై సంద‌డి చేసిన ఇలియానా సినిమాలో బొద్దుగా క‌న‌ప‌డింది. ఇలియానా డ‌బ్బింగ్ బాగానే చెప్పింది. అయితే డాన్సు మూమెంట్స్ లో మాత్రం ఇబ్బందిగా క‌ద‌ల‌డం క‌న‌ప‌డింది.

ఇక కామెడీ ట్రాక్ కోసం వెన్నెల‌కిషోర్‌, శ్రీనివాస్ రెడ్డి, ర‌ఘుబాబు తెలుగు అసోషియేష‌న్స మెంబ‌ర్స్‌గా చేసిన కామెడీ.. అప్పుల బాబీగా సునీల్ కామెడీ.. జూనియ‌ర్ పాల్‌గా స‌త్య కామెడీ ఓవ‌రాల్‌గా బాగా లేక‌పోయినా.. పార్టుల వైజ్‌గా చూస్తే కామెడీ ఓకే.

ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల ఈ క‌థ‌లో కొత్త‌ద‌నంగా ఏమీ చూపించాల‌నుకున్నాడో అర్థం కాలేదు. అతనొక్క‌డే కాన్సెప్ట్‌కు అపరిచితుడు మిక్స్ చేసి ఓ క‌థ‌ను రాసేసుకున్నాడు. దాన్ని ర‌వితేజ ఒప్పుకోవ‌డం వెనుక రీజ‌న్ తెలియ‌లేదు. శ్రీనువైట్ల స‌న్నివేశాల‌ను ఆస‌క్తిక‌రంగా రాసుకోలేదు. నేప‌థ్య సంగీతం ఓకే. వెంక‌ట్ సి.దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

రేటింగ్‌ 2.5