ఉసిరి మెంతికాయ పచ్చడి

కావలసినవి:
ఉసిరికాయలు – ముప్ఫై; సెనగపప్పు, మినప్పప్పు – ఐదు చెంచాల చొప్పున; ఆవాలు – మూడుచెంచాలు; కరివేపాకు రెమ్మలు- నాలుగు; ఎండు కొబ్బరి కోరు – పావుకప్పు;నూనె – కప్పు; ఎండుమిర్చి – ఇరవైనాలుగు; ఉప్పు- రెండు చెంచాలు; మెంతులు – రెండుచెంచాలు; జీలకర్ర- చెంచా; పచ్చిమిర్చి – ఆరు.

తయారీ:
ఉసిరికాయల్ని అలాగే పొడుగాటి ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి. బాణలిలో కాస్త నూనె వేడిచేసి మెంతులు, ఎండుమిర్చి, ఆవాలు వేయించుకోవాలి. చల్లారాక ఉప్పు చేర్చి మెత్తని పొడిలా, కూరకారంలా చేసుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో మరో చెంచా నూనె వేడిచేసి తాలింపు దినుసులు, కరివేపాకు రెమ్మలు, పచ్చిమిర్చి ఒకదాని తరవాత ఒకటి వేయించి పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో ఉసిరిముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ముక్క మెత్తగా అయ్యాక ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కూరకారం కలపాలి. పైన పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు… తాలింపు దినుసులు వేస్తే సరిపోతుంది. నోరూరించే ఈ ఉసిరి మెంతికాయ ఏడాది పాటు నిల్వ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

apteka mujchine for man ukonkemerovo woditely driver.