పార్టీ మారడంపై అఖిలప్రియ స్పందన చూసారా?

మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ పార్టీ మారతారంటూ వ్యాపించిన వదంతులపై ఆమె స్పందించారు. కర్నూలులో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని మరీ తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీటిని నమ్మొద్దని ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డలో గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని అన్నారు. చంద్రబాబు వల్లే ఆళ్లగడ్డకు నీళ్లొచ్చాయని అన్నారు. నిర్వాసితులకు ప్రస్తుతం ఉన్న ధరకు ఐదు రెట్లు ఇవ్వాలని, నిర్వాసిత కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు.