ప్యాకెట్‌ ఫుడ్స్‌ తింటున్నారా?

చిప్స్‌, చాక్లెట్స్‌ అంటే చిన్నపిల్లలకే కాదు, అందరికీ ఇష్టమే. ప్యాకెట్లతో లభ్యమయ్యే వీటిని టేస్ట్‌ బాగుంటుందని తెగ తింటూ ఉంటారు. బిర్యానీ, ఫ్రైడ్‌రైస్‌, పిజ్జా, బర్గర్‌, మిల్క్‌ షేక్స్‌ ఇలా ఏవైనా కావచ్చు. వీటిలో అసలు వాటికి అంత టేస్ట్‌ ఎందుకు వస్తుందనేగా మీ సందేహం? దానికి కారణం ఎమ్మెస్జీ. అంటే మోనోసోడియం గ్లటమేట్‌. అది తీపి వాటికి కావచ్చు, లేదా ఉప్పు కావచ్చు. ప్యాక్డ్‌ ఫుడ్‌ ఐటమ్స్‌లో వీటిని విరివిరిగా వాడుతూ ఉంటారు. ఎమ్మెస్జీకి ఆకలి పెంచే స్వభావం ఉంటుంది. ప్యాక్డ్‌ ఫుడ్‌ ఐటమ్స్‌లో ఎమ్మెస్జీ అధికంగా ఉంటోంది. వీటిని తరచూ తినడం అలవాటైతే భవిష్యత్తులో ఊబకాయం వంటి సమస్యలు ఎదురుకావచ్చని న్యూట్రిషనిస్టులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*