అచ్చెన్నాయుడుకు తప్పిన ప్రమాదం!

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో టీడీపీ బైక్ ర్యాలీలో మంత్రి అచ్చెన్నాయుడు కాన్వాయ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. అచ్చెన్నాయుడు ఎస్కార్ట్ వాహనం పై వైసీపీ హోర్డింగ్ బోర్డు పడింది. బైక్ ర్యాలీ చేస్తున్న నలుగురు టీడీపీ కార్యకర్తలకు స్వల్పగాయాలయ్యాయి. అంతకు ముందు సోంపేట మండలం కొర్లాం నుంచి ఇచ్ఛాపురం వరకూ టీడీపీ బైక్ ర్యాలీని మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అయితే మంత్రి అచ్చెన్నాయుడుకి ఏమి కాకపోవడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.