అందానికి బీట్ రూట్ తో సంబంధం ఉందా?

బీట్ రూట్ ఆరోగ్యానికే కాదు అందానికి ఎంతో ఉపయోగపడుతుంది.బీట్ రూట్ రసంలో ఉండే లక్షణాలు కళ్ళ ఉబ్బును నివారిస్తుంది. రెండు చెంచాల బీట్ రూట్ రసంలో ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఇరవై నిముషాల తర్వాత ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలతో పాటు వాటి తాలుకు మచ్చలను కూడా పూర్తిగా నివారిస్తుంది. బీట్ రూట్ జ్యూస్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది. బీట్ రూట్ పేస్ట్‌లో కొద్దిగా పాలు మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఒక టీస్పూన్ బీట్ రూట్ జ్యూస్‌కు ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకొనే ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బీట్ రూట్ రసం, షుగర్ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయడం వల్ల ముఖంలో ఉండే బ్లాక్ హెడ్స్ నివారించబడుతాయి. ఉడకబెట్టిన బీట్‌రూట్‌ను గుజ్జుగా చేసి ముఖానికి, మెడభాగంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే మీ చర్మంలో కాంతి వస్తుంది.