పచ్చిపాలతో కాంతివంతమైన ముఖం..

పచ్చిపాలలో ఉండే విటమిన్లు, ప్రొటీన్స్‌తో పాటు లాక్టిక్‌ యాసిడ్‌ చర్మానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. ఆ లాభం అందుకోవాలంటే పచ్చిపాలతో రూపొందించే కొన్ని ఫేస్‌ ప్యాక్‌ల గురించి తెలుసుకొవాలి.

*పచ్చిపాలు-పసుపు విటీ కలయిక చర్మాన్ని కాంతిమంతం చేసి, మొటిమలు మచ్చల్ని తగ్గిస్తుంది.
*పచ్చిపాలు- తేనెతో పొడిబారిన చర్మం ఉన్నవారిలో ఈ ఫేస్‌ ప్యాక్‌ తేమను మెరుగుపరుస్తుంది.
*పచ్చిపాలు- ఓట్‌మీల్‌ లా మిశ్రమాన్ని చర్మం మీద నిదానంగా రుద్దుతూ మసాజ్‌ చేస్తే మృతకణాలు తొలగిపోతాయి.
*పచ్చిపాలు- దోసగుజ్జు కలయిక చర్మానికి చల్లదనాన్ని అందించి, ముఖాన్ని తేటగా మారుస్తుంది. ఇవే కాకుండా శనగపిండి, చందనం, అలోవెరా లాంటివాటితోనూ ఫేస్‌ ప్యాక్‌లు మంచి ఫలితాలను ఇస్తాయి