Mana Aksharam
Andhra Crime Homepage-Slider News

నగల దుకాణంలో భారీ చోరీ!

నగరంలోని చిన్నబజారు వీధిలో ఉన్న లావణ్య నగల దుకాణంలో శనివారం భారీ చోరీ జరగింది. క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి కథనం మేరకు.. చిన్నబజారు వీధిలోని లావణ్య జ్యువెలరీస్‌ను హేమంత్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. అతను షాపు వెనుకవైపే నివాసముంటున్నాడు. శుక్రవారం దుకాణం మూసి వెళ్లి శనివారం ఉదయం తెరిచాడు. రెండు కేజీల బంగారు, రూ.35 వేల నగదు చోరీకి గురైనట్టు గుర్తించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ను పిలిపించి వేలిముద్రలను సేకరించారు. దుకాణంలో సీసీ కెమెరాలు లేవు. ప్రదర్శనకు ఏర్పాటు చేసిన నగలు అలాగే ఉన్నాయి. వస్తువులు కూడా చిందరవందర కాలేదు. దీంతో పోలీసులు కొత్తకోణంలో విచారించారు. దుకాణంలో పనిచేసే ఓ వ్యక్తి శుక్రవారం యజమాని ఇంటికి వచ్చినట్టు గుర్తించారు. ఆ సమయంలో దుకాణంలోకి వెళ్లి చోరీకి పాల్పడి ఉండవచ్చునని భావించి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దీనిపై కేసు పరిశీలించి కేసు నమోదు చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీతో సీఐలు అబ్బన్న, శరత్‌ చంద్ర పరిశీలించారు.

Related posts

అనంతలో జగన్ తొలి అడుగులు!

admin

హైదరాబాద్ కిరీటంలో మరో కలికితురాయి

admin