లోకేష్ పై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

మంత్రి నారా లోకేష్ దుబాయ్ వెళ్ళి దావుద్ ఇబ్రహీం కలిసినట్టు అందరూ అంటున్నారని, అందుకే రాష్ట్రంలో ‘సిబిఐ ‘ని నిరాకరించారని అందరూ అంటుంటే ఇది నిజమేనెమో అనిపిస్తుందని బీజేపీ శాశనసభపక్షనేత, విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు విశాఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ  ప్రభుత్వం చేస్తున్న భూ కుంభకోణాలపై నేడు విశాఖ ఎన్డీయే జంక్షన్ వద్ద బీజేపీ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ కుంభకోణం జరుగుతుందని, ఎక్కడ ఖాళీ భూమి ఉంటే అక్కడ టీడీపీ దోచేస్తుందని అయన దుయ్యబట్టారు.. సిట్ విచారణ చేసిన నివేదికని బయటపెట్టకుండా లీకులు ఇస్తున్నారని, ఇది తమవారిని కాపాడటానికే సిట్ నివేదికని బయటపెట్టడం లేదని ఆరోపించారు. ఇవన్నీ టీడీపీ వారే చేస్తున్నారని, వీటిపై సిబిఐ విచారణ చేయించాలని కోరుతున్నట్టు అయన అన్నారు. భీమిలి ప్రాంతంలో ఎక్కువగా భూ కుంభకోణాలు జరుగుతున్నాయని, మంత్రి గంటా శ్రీనివాసరావుకి సిట్ దర్యాప్తు ద్వారా క్లీన్ చిట్ ఎవరు ఇచ్చారు ఎలా ఇచ్చారో చెప్పాలని, ఆయనకు ఆయనే క్లీన్ చిట్ ఎలా ఇచ్చుకుంటారని ప్రశ్నించారు.