‘బీఎస్‌ఎన్‌ఎల్‌’ కొత్త వార్షిక ప్లాన్‌!

ప్రభుత్వ రంగ టెలికాం  రంగ సంస్థ  బీఎస్‌ఎన్‌ఎల్‌  సరికొత్త ప్లాన్‌ను ప్రారంభించింది. ప్రధానంగా రిలయన్స్‌ జియోకు కౌంటర్‌గా కొత్త వార్షిక ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.1097ల విలువైన వార్షిక  ప్రీపెయిడ్‌ ప్లాన్‌ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో మొత్తం 25జీబీ డేటాను, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది.  వాలిడిటీ 365 రోజులు. ప్రస్తుతానికి కోలకతా సర్కిల్‌లో  ఈ ప్లాన్‌ అందుబాటులో ఉంది.  జనరి 6, 2019వరకు ఈ వార్షికప్లాన్‌ లభ్యం కానుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది. జియో రూ.1699 ప్లాన్‌లో  రోజుకు 1.5జీబీ డేటా చొప్పున సంవత్సరమంతా డేటా ఉచితం.  అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌,రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఆఫర్‌ చేస్తోంది.