సీ-ఓటర్‌ సర్వే: తెలంగాణలో కూటమి ప్రభంజనం?

ఇండియా టుడే – పొలిటికల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (PSE) సర్వే తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని వెల్లడిస్తే.. సీ-ఓటర్ సర్వే మాత్రం ఇందుకు భిన్నమైన అంచనాలు వెల్లడించింది. తెలంగాణలో మహాకూటమి విజయం తథ్యమని ప్రకటించింది. కూటమికి 64 సీట్లతో స్పష్టమైన మెజారిటీ వస్తుందని, టీఆర్ఎస్కు 42 సీట్లు మాత్రమే వస్తాయని ప్రకటించింది.

తెలంగాణలో మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు 33.9 శాతం ఓట్లతో 64 సీట్లు, 29.4 శాతం ఓట్లతో టీఆర్ఎస్ 42 సీట్లలో గెలుపొందుతాయని అంచనా వేసింది. అన్నీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన బీజేపీకి 4, ఇతరులకు 9 సీట్లు చొప్పున లభిస్తాయని పేర్కొంది. అయితే, కేసీఆర్‌ సీఎంగా ఉండాలని 42.90 శాతం మంది కోరుకుంటున్నారని, జానారెడ్డి సీఎంగా ఉండాలని 22.60 శాతం మంది కోరుకుంటున్నారని వివరించింది.