కేంద్రంపై చంద్రబాబు భగ్గు!

తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భగ్గుమన్నారు. ఆయన మంగళవారం ఉదయం తమ పార్టీ పార్లమెంటు సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

పార్టీ ఎంపీలకు ఆయన మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని ఆయన వారికి సూచించారు. ప్రజల గొంత పార్లమెంటులో ప్రతిబింబించాలని ఆయన అన్నారు.

ప్రత్యేక హోదా తమ హక్కు అని చంద్రబాబు అన్నారు. ఎందుకు ఇవ్వరని ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎంపీలు పోరాటం చేయాలని ఆయన సూచించారు.

సెంటిమెంట్‌కు ఆ రోజు రాష్ట్రమే ఇచ్చారని చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ఈ రోరజు సెంటిమెంటు చూసి కూడా డబ్బులు ఇవ్వలేమంటారా, ఇదేం న్యాయమని ఆయన ప్రశ్నింంచారు. తమ డిమాండ్లు హేతుబద్దమైనవని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడగడం నిర్హేహతుకమా అని కూడా ఆయన ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

apteka mujchine for man ukonkemerovo woditely driver.