‘ఛీ’ పో.. చింతమనేని!

జర్నలిజం విలువలు.. ఈ మాట ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో అనిపిస్తుంది. జర్నలిజం విలువలకు ప్రాణాలు అర్పించిన మన తెలుగు నేలపై.. ఇవాళ్టి రోజున ఛీ నా కొడకల్లారా అని తిట్టినా తుడిచేసుకుని పోతున్న కొంతమందిని జర్నలిస్టులను కూడా చూస్తున్నాం. ఛీ అన్నా ప‌డి ఉండ‌డం, ఏం చెప్పినా చేస్తుండ‌డం వారికి అలవాటుగా మారింది. ఒకప్పుడు విలువలతో కూడిన జర్నలిస్టులు ఉండేవారు .. ఇప్పుడు లేరు అని చెప్పటానికి సాటి జర్నలిస్టుగా సిగ్గుపడుతున్నాను. ఈ వార్తను కూడా చంద్రబాబు కాలి దగ్గర పని చేసే కొన్ని పచ్చ ఛానళ్ళు ప్రసారం చేయకపోవటం సిగ్గుచేటు మిత్రులారా.

తాజాగా ఇలాంటి సంఘటనే పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిన్నటి రోజున మీడియా వారిపై రాయలేని పదజాలంతో బూతు పురాణం విప్పారు. మీడియా పై చిందులేశారు. అయన ఇంతకోపానికి కారణం … చింతమనేని ఏదో మీటింగు ముగించుకొని వస్తుండగా ఆయన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చినటువంటి కొంతమంది మీడియా మిత్రులను ఆయన బెదిరిస్తూ నిప్పులు చెరిగారు,అంతే కాకుండా వారిని పచ్చి బూతులు కూడా తిట్టారు.ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి ప్రజలకు సమగ్ర సమాచారాన్ని చేరవేసే వారధిగా ఉండేటువంటి మీడియా వారి పై చింతమనేని ఇలా ప్రవర్తించడంతో మీడియా లోని ఒక వర్గం ఆయన్ని ఛీ కొడుతున్నారు,ఈ వీడియోని కొన్ని చానెల్స్ లో ప్రసారం చేస్తుండగా చంద్రబాబు కాలి దగ్గర పని చేసే కొన్ని పచ్చ ఛానళ్ళు మాత్రం ఈ వార్తను వారి ఛానెల్లో మాత్రం ప్రసారం చెయ్యడం లేదని నెటిజన్లు నుంచి విమర్శలు వస్తున్నాయి. సాటి మీడియా వారిపై అలాంటి బాష వాడితే కనీసం మీడియా పెద్దలు నిరసన కూడా తెలపకపోవడం ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు.