ఏపీలో మరో రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన!

ఏపీలో మరో రెండు కీలకమైన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం శంకుస్థాపన చేశారు. విజయవాడ ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 3.2 కిలోమీటర్ల పొడవుతో రూ. 1387 కోట్లతో ఈ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి అమరావతిలోని ఉద్ధండరాయునిపాలెంను ఈ వంతెన కలుపుతుంది. ఎల్ అండ్ టీ సంస్థ ఈ వంతెనను నిర్మిస్తోంది. దీంతో పాటు రూ. 750 కోట్లతో వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు.