రాగి,ఇత్త‌డి పాత్ర‌ల వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు

పూర్వం ఒక‌ప్పుడు మ‌న పెద్ద‌లు ఇళ్లలో ఎక్కువ‌గా రాగి, ఇత్త‌డి వ‌స్తువుల‌నే వాడేవారు. ఇప్పుడంటే అంతా ప్లాస్టిక్‌మ‌యం అయిపోయింది. కానీ ఒక త‌రానికి ముందు మ‌న పెద్ద‌లు రాగి, ఇత్త‌డి పాత్ర‌ల‌ను విరివిగా ఉప‌యోగించేవారు. దీంతో వారు ఇప్పటికీ అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఆరోగ్యంగా ఉన్నారు. అందువ‌ల్ల మ‌నం కూడా రాగి, ఇత్త‌డి పాత్ర‌ల‌ను వాడితే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

రాగి పాత్రలో కేవ‌లం 3 గంట‌ల పాటు నీటిని నిల్వ ఉంచితే చాలు. ఆ నీటిలో ఉండే క్రిములు నశిస్తాయి. దీంతో ఆ నీరు ప‌రిశుభ్రంగా మారుతుంది. రాగి పాత్ర‌ల‌లో నీటిని నిల్వ ఉంచ‌డం వ‌ల్ల ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ-కొలి బాక్టీరియా కూడా అంతమ‌వుతుంది. దీని వ‌ల్ల అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. ఇత్త‌డి పాత్ర‌ల‌ను జింక్‌, అలాయ్ మిశ్ర‌మంతో త‌యారు చేస్తారు. జింక్ వ‌ల్ల మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతంది. అందుక‌ని ఇత్త‌డి పాత్ర‌ల్లో అయినా నీటిని తాగ‌వ‌చ్చు. లేదా ఆ పాత్రల్లో వంట చేసుకుని తిన‌వ‌చ్చు.

రాగి పాత్ర‌ల్లో నిల్వ ఉంచిన నీటిని తాగ‌డం వ‌ల్ల అసిడిటీ, అజీర్ణం, డ‌యేరియా, కామెర్లు, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. గుండె స‌మ‌స్య‌లు రావు. క్యాన్స‌ర్ క‌ణాలు న‌శిస్తాయి. థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెర‌గ‌వుతుంది. ర‌క్త‌హీన‌త పోతుంది. హైబీపీ త‌గ్గుతుంది.

రాగి పాత్ర‌ల‌లో నీరు ఏ విధంగా శ్రేష్టం?
నీటికి జ్ఞాపక శక్తి ఉంటుంది కనుక దానిని ఎలా నిల్వ చేయాలన్న విషయమై మనం చాలా ఎరుకతో ఉండాలి. మీరు నీటిని రాగి పాత్రలలో రాత్రంతా లేదా కనీసం నాలుగు గంటల పాటు నిల్వ చేసి ఉంచితే, ఆ నీరు రాగి నుంచి కొన్ని ప్రత్యేక లక్షణాలు సంతరించుకుంటుంది. అలాంటి నీటిని తాగడం వల్ల అది మీ శరీర ఆరోగ్యానికీ, ముఖ్యంగా కాలేయానికి ఎంతో మేలు చేయడంతో పాటు శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. నీటిని పంపులతో బలంగా తోడి, అది ప్లాస్టిక్ పైపుల ద్వారా మలుపులు తిరుగుతూ ప్రయాణిస్తే, అటువంటి నీటికి చాలా ప్రతికూలత కలుగుతుంది.

apteka mujchine for man ukonkemerovo woditely driver.