చంద్రబాబు ఎఫెక్ట్ : జనసేనలోకి మాజీ మంత్రి!

కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేత, మాజీ మంత్రి వట్టి వసంత కుమార్‌ రాజీనామాస్త్రం సంధించారు. పార్టీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై పూర్తిస్థాయి అసంతృప్తి ప్రకటించారు. ఇన్ని దశాబ్దాలు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నందుకు అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని, తెలుగుదేశంతో మిత్రత్వం కోరుకోవడాన్ని హర్షించలేక పోతున్నట్టు వసంతకుమార్‌ ప్రకటించారు. నేరుగా తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీకి పంపానని చెప్పారు. తీవ్ర మానసిక ఆవేదనతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వసంతకుమార్‌ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్‌ను ఒక కుదుపు కుదిపింది. సాధారణంగా కాంగ్రెస్‌నే నమ్ముకుని నాలుగు దశాబ్దాలుగా వసంత్‌ రాజకీయాలు నెరపుతున్నారు. 2014 రాష్ట్ర విభజన సందర్భంలో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించలేక మిన్నకుండిపోయారు.వసంత్‌ రాజీనామాతో ఆయన అనుచర వర్గం డీలా పడింది. ఆయన బాటలోనే వారు ప్రయాణించే అవకాశం లేకపోలేదు. అయితే ఆయన జనసేన వైపు వెళ్ళే అవకాశాలున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

apteka mujchine for man ukonkemerovo woditely driver.