స్మార్ట్‌ఫోన్లపై ‘బంపర్ ఆఫర్’ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ప్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై తైవాన్‌ మల్టీనేషనల్ కంపెనీ ఆనుస్ జెన్‌ఫోన్ 5 జెడ్ ఫోన్లపై  5వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అక్టోబర్ 24 అంటే ఈరోజు నుండి  నుంచి 27 వరకూ ఈ డిస్కౌంట్ ఆఫర్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. 3జిబి ర్యామ్ ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 ఫోన్ రూ. 9,999 ధరకు కస్టమర్లకు లభిస్తోంది. 4జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్ రూ.12,999లకు లభిస్తుండగా, 6జిబి ర్యామ్ కలిగిన మొబైల్ రూ. 14,999తో ప్రారంభమవుతోంది. అన్ని వేరియంట్ల స్మార్ట్ ఫోన్లపై ఇఎంఐ ఛార్జీలు లేవు. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా ఆనుస్ ఫోన్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు అదనంగా 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉందని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది.