ఈ మాత్రలతో ఆడ సంతానానికి హాని!

గర్భిణులు నొప్పి నివారణకు పారాసెటమాల్‌ ఔషధం వాడితే పుట్టబోయేది ఆడపిల్ల అయితే, ఆమె పెద్దయ్యాక సంతానోత్పత్తి సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఔషధం వల్ల పురుషుల్లో శుక్ర కణాల నాణ్యత తగ్గిపోతుందనే తెలుసు. స్త్రీ సంతానోత్పత్తికి ఆటంకం ఏర్పడుతుందా అనే కోణంలో ఎవరూ పరిశోధనలు చేయలేదు.

ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఈ దిశగా ఎలుకలపై పరిశోధనలు చేయగా ఆందోళన కల్గించే విషయం వెల్లడైంది. పారాసెటమాల్‌ వల్ల అండాల ఉత్పత్తి తగ్గి సంతానానికి సమస్యగా మారే అవకాశం ఉందని తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*